Ntr : రైటర్ గా మారబోతున్నాడా?

నిజంగా ఎన్టీఆర్ రైటర్ గా మారబోతున్నాడా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ఎన్టీఆర్ బెస్ట్ పెర్ఫార్మర్. ఆల్ రౌండర్ కూడా..! డ్యాన్స్ లు, ఫైట్లు, డైలాగులు.. ఇలా అన్నీ అదరగొట్టేస్తాడు. అయితే ఎన్టీఆర్ లో ఎవ్వరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. విషయంలోకి వెళ్తే.. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ చాలా కష్టాలు పడ్డాడు. ఇండస్ట్రీలో అన్ని విభాగాల్లోనూ పనిచేశాడు. ‘ఒక వేళ హీరోగా నిలబడకపోతే క్లాప్ బాయ్ గానో, లైట్ మెన్ గానో’ పనిచేసుకుంటూ ఇండస్ట్రీ లోనే ఉంటాను’ అని చాలా మంది సినీ పెద్దల వద్ద చెప్పాడట. అతని డెడికేషన్ ను చూసి ఆ పెద్దలు బ్లెస్ చేసి ఉంటారు. అందుకే ఇంత పెద్ద స్టార్ అయ్యాడు.

సరే ఇక అసలు మేటర్ ఏంటంటే.. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ కొన్ని కథలు రెడీ చేసుకున్నాడట. ఇప్పుడు తన ఇమేజ్ కు తగ్గ కథలు కావు అవి అని సమాచారం. అందుకే తన కొడుకుల పేర్ల పై సొంత బ్యానర్ ను స్థాపించి.. ఆ కథలను యంగ్ హీరోలతో లో బడ్జెట్ లో తెరకెక్కించాలి అని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఆల్రెడీ మహేష్, నాని వంటి హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలు తీసి హిట్లు కూడా కొట్టేశారు. ఇప్పుడు రవితేజ కూడా అదే పనిలో ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో ఆలస్యం చేయకూడదు అని డిసైడ్ అయినట్టు వినికిడి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు