Megastar: మెగా మూవీలో మలయాళం స్టార్ ?

బిజు మీనన్… లాక్ డౌన్ టైం లో తెలుగు ప్రేక్షకులు ఈ కొత్త నటుడు ఎవరా అని గూగుల్ ను తెగ అడిగారు. తీరా ఇతను ఎవరా అని చూస్తే ఆల్రెడీ మన తెలుగులో గోపీచంద్ ‘రణం’, రవితేజ ‘ఖతర్నాక్’… వంటి చిత్రాల్లో చేసిన నటుడే.! ‘భీమ్లా నాయక్’ కు మాతృక అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ లో ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన పాత్రని పోషించాడు బిజు. ఈ చిత్రాన్ని లాక్ డౌన్ టైంలో తెలుగు ప్రేక్షకులు కూడా ఓటీటీలో ఎక్కువగా చూశారు. అతను ఇంత పెద్ద స్టారా? ఇంత గొప్ప నటుడా? అని అప్పుడే తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన మళ్ళీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

విషయంలోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య'(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.’మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా సముథ్రఖని చేయాల్సి ఉంది. కానీ అతనికి పవన్ కళ్యాణ్ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో చిరు చిత్రంలో నటించే ఆఫర్ ను వదులుకున్నాడు. ఇప్పుడు సముథ్రఖని ప్లేస్ లో బిజు మీనన్ ను ఎంపిక చేసుకోబోతున్నారని సమాచారం. బిజు మీనన్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నిర్మాతలు భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు