Balayya – Gangs of Godavarai : సీజీ ఓ గొప్ప వరం… అన్నీ కవర్ చేయొచ్చు

Balayya – Gangs of Godavarai : సీజీ… కంప్యూటర్ గ్రాఫిక్స్..
ఈ టెక్నాలజీ యుగంలో దీన్ని వాడకం చాలా ఎక్కువే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సీజీ ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య వచ్చిన ప్రతీ పెద్ద సినిమా సీజీ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నరంటే సినిమా ఇండస్ట్రీకి సీజీ ఎంత గొప్ప వరమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. సీజీ… ఒక సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ కూడా బాగానే వాడుతున్నారు.

సీజీ ఉపయోగించి హైట్ తక్కువ హీరోను కాస్త హైట్ పెంచుతున్నారు. అదే సీజీతో లావుగా ఉన్న హీరోయిన్‌ను సైజ్ జీరోలోకి మారుస్తున్నారు. ఇంకా చాలా…. చేస్తున్నారు. ఇవన్నీ కూడా సినిమాల కోసమే. అయితే ఇప్పుడు, ఈ రోజు సీజీ వర్డ్ వైరల్ అవుతుంది. ఎందుకంటే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య మందు తాగాడాని ఓ న్యూస్ వైరల్ అయింది. న్యూస్ ఒక్కటే కాదు, బాలయ్య దగ్గర ఉన్న మందు బాటిల్ వీడియో కూడా అన్ని మీడియాల్లో దర్శనమిచ్చింది.

అక్కడ మందు బాటిల్ ఉందా..? లేదా అనేది చర్చ జరుగుతున్న సమయంలో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత ఓ మాట అన్నారు. అదే సీజీ. అక్కడ ఎలాంటి బాటిల్ లేదని, ఈవెంట్ చేసింది తానే అని, ఆ.. మాత్రం తెలిదా.. అంటూ మీడియా ముందు ప్రొడ్యూసర్ నాగ వంశీ కొన్ని మాటలు చెప్పారు. అయితే దీని కంటే ముందు ఇదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హీరో విశ్వక్ సేన్.. బాలయ్య దగ్గర ఉన్నది మందు కాదు, అది జ్యూస్ అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

సరే.. అది మందా…? జ్యూసా…? అనేది పక్కన పెడితే నిర్మాత సీజీ గురించి ఎందుకు చెప్పుకొచ్చారు అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్ గా మారింది. దీంతోనే సీజీ అనేది సినిమాలకు మాత్రమే కాదు, సినిమాల్లో నటించే వాళ్లకు మాత్రమే కాదు… ఇలాంటి దొంగ పనులు చేసే టైం లో కూడా యూజ్ చేసుకోవచ్చు అంటూ విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. సీజీ పేరు చెప్పి ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నటు చెప్పి ప్రజలను మబ్యపెడుతున్నారు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల్లోనే అత్యంత బడ్జెట్ తో సీజీ పనులు చేస్తారు. అలాంటిది.. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అత్యంత నాణ్యంగా సీజీ పనులు చేస్తారా..? అంటూ ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీంతో సీజీని సినిమాల్లో వాడండి.. అంతే కానీ, ఇలాంటి వాటిల్లో సీజీ పేరు చెప్పకండి.. అక్కడ ఉన్నది నిజమైన మద్యమే అంటూ కొంత మంది నిర్మాతపై సెటైర్లు వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు