Hamare Baarah Controversy : రాజకీయంగా దుమారం రేపుతున్న మూవీ… మేకర్స్ కు ప్రాణహాని

Hamare Baarah Controversy : కమల్ చంద్ర దర్శకత్వం వహించిన హమారే బార్హ్ మూవీ టీజర్ విడుదలైనప్పటి నుండి తీవ్ర దుమారం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో అను కపూర్, మనోజ్ జోషి, పరితోష్ త్రిపాఠి నటిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్‌పై వివాదం చెలరేగడంతో పాటు నటీనటులను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. వివాదం రేకెత్తించే విధంగా సినిమాలో ఏముంది? అంటే..

టీజర్ తో దుమారం

హమారే బారా సినిమా టీజర్‌లో ఆడవాళ్ల బాధలను బోల్డ్‌గా చెప్పడం కనిపించింది. ఇందులో పెరుగుతున్న జనాభా అంశాన్ని లేవనెత్తగా, దీని వల్ల మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూపించారు. అయితే ఈ టీజర్ కొంతమందిని షాక్‌కి గురి చేసింది. ఓ వర్గం ముఖ్యంగా ముస్లింల మనోభావాలు దెబ్బతినడంతో సినిమాలో నటించిన నటీనటులకు చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి.

బెదిరింపులపై టీం రియాక్షన్

చంపుతామనే బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో పోలీసు రక్షణ కల్పించాలని ఇందులో ప్రధాన పాత్రను పోషించిన నటుడు అను కపూర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై అను కపూర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ స్పందించింది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో మహిళా సాధికారత అంశాన్ని లేవనెత్తడంతోపాటు మహిళా హక్కులపై తెరకెక్కించాము. ముందు సినిమా చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. సోషల్ మీడియాలో తమ మనసులోని మాటను చెప్పే స్వేచ్ఛ ప్రజలకు ఉంది. కానీ తప్పుగా ప్రవర్తించకూడదు. ఆ హక్కుని ఎవరినీ బెదిరించడానికి దుర్వినియోగం చేయడం లేదా హత్య బెదిరింపులు చేయవద్దు. ఇలాంటి వాటికి మేము భయపడము. మహిళా సాధికారత గురించి మాట్లాడడానికే ఈ సినిమా చేశాం. ఇందులో జనాభా పెరుగుదల అంశంపై చర్చించారు. ఇది ఏ కులం లేదా వర్గాల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం కాదు” అని క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

Annu Kapoor Seeks Police Protection As Hamare Baarah Makers Receive Death  Threats: 'First Watch It' - News18

రాజకీయంగా సంచలనం

ఈ సినిమాపై నిషేధం విధించాలని ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే జితేంద్ర అవద్ డిమాండ్ చేశారు. ఓ వర్గం పరువు తీసేలా ఈ సినిమా తీశారని అన్నారు. విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక ముస్లిం ఇంట్లో 10 మంది పిల్లలను చూపించిన వారికి రూ.11 లక్షల రివార్డు ఇస్తాను. ఇప్పుడు ముస్లింలకు 10 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు లేరు. అలాంటి సీనే లేనప్పుడు ప్రజలలో ఎందుకు ఇలాంటి అపార్థం క్రియేట్ చేస్తున్నారు? ఎంతమంది పిల్లలకు జన్మనివ్వాలి అనేది ఆ భార్యాభర్తలకు సంబంధించిన విషయం. ఒక స్త్రీ ఎక్కువ మంది పిల్లలను కోరుకోకపోతే, ఆమె తిరస్కరించవచ్చు” అంటూ హమారే బరా మూవీ టీంపై మండిపడ్డారు.

సెన్సార్ కష్టాలు

టీజర్‌కి ముందే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌ ఆసక్తిని పెంచేసింది. ముస్లిం మహిళల ఇబ్బందులను సినిమాలో చూపించబోతున్నారనే విషయాన్ని పోస్టర్ తో స్పష్టం చేశారు. ఇంతకుముందు ఈ మూవీ టైటిల్ ‘హమ్ దో హమారే బరా’ అని అనౌన్స్ చేశారు. అయితే సెన్సార్ బోర్డు టైటిల్‌ను మార్చింది. ‘హమారే బరా’ జూన్ 7న విడుదల కానుంది. హమారే బరా చిత్రానికి కమల్ చంద్ర దర్శకత్వం వహించగా, రాజన్ అగర్వాల్ రచించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు