Director Omar Lulu : ప్రియా ప్రకాష్ వారియర్ డైరెక్టర్ పై అత్యాచారం కేసు

Director Omar Lulu : ప్రియా ప్రకాష్ వారియర్‌ను స్టార్‌ని చేసిన ‘ఒరు అదార్ లవ్’ సినిమా దర్శకుడు ఒమర్ లులుపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు పెట్టింది ఓ యువతి. ఈ ఆరోపణలపై తాజాగా దర్శకుడు స్పందించారు. అసలు వీరిద్దరి మధ్య ఎం జరుగుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

దర్శకుడు ఒమర్ లులుపై అత్యాచారం కేసు

‘ఒరు ​​అదార్ లవ్’తో పాటు కొన్ని హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ మలయాళ దర్శకుడు ఒమర్ లులుపై ఓ నటి అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఎర్నాకులం రూరల్ పోలీస్ స్టేషన్‌లో దర్శకుడు ఒమర్‌పై యువ నటి ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే ఆ నటి ఎవరు అన్న విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈ కేసును ఇప్పుడు నిడుంబస్సేరి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. డైరెక్టర్ ఒమర్‌పై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సినిమాలో అవకాశం పేరుతో లైంగిక వేధింపులు

సినిమాలో అవకాశం ఇప్పిస్తానని దర్శకుడు ఒమర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడ్డాడని యువ నటి ఆరోపించింది. ఈ కేసు గురించి దర్శకుడు ఒమర్ లులు స్టేట్‌మెంట్ ఇస్తూ ‘ఇది బ్లాక్‌మెయిల్ స్ట్రాటజీ మాత్రమే. ఆ నటి ఉద్దేశం నాపై ఆరోపణలు చేసి నా పరువు తీయడం, నా దగ్గర డబ్బులు వసూలు చేయడం. ఆ నటి నా గత సినిమాలో నటించింది. ఇప్పుడు నేను కొత్త సినిమా చేస్తున్నాను. అయితే నా కొత్త సినిమాలో అవకాశం ఇవ్వలేదనే కోపంతో ఆమె ఇలా చేసింది’ అని అన్నారు.

- Advertisement -

Omar Lulu Booked For Raping Actress | Omar Lulu Raped Actress Name | Omar  Lulu Sexual Assault Case | Who Is Omar Lulu? | Omar Lulu's Response In Rape  Case - Filmibeat

దర్శకుడి రియాక్షన్

దర్శకుడు ఒమర్ కేసు గురించి మాట్లాడుతూ ‘ఆ యువ నటి, నేను మంచి స్నేహితులం. మేమిద్దరం కలిసి కొన్ని ట్రిప్పులకు వెళ్లాం. అయితే గత ఆరు నెలల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో టచ్‌లో ఉండడం లేదు. ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేశాను. నా సినిమాలో ఆ నటికి అవకాశం ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు నాపై కోపంతో ఈ ఫిర్యాదు చేసింది” అంటూ చెప్పుకొచ్చాడు.

డైరెక్టర్ ఒమర్ సినిమాలు

వన్ టైమ్ వండర్ గా మిలిగిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఫస్ట్ మూవీ ‘ఒరు అదార్ లవ్’ చిత్రానికి దర్శకుడు ఒమర్ లులు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలోని ప్రియా ప్రకాష్ వారియర్‌కి సంబంధించిన ఒక సన్నివేశం వైరల్‌గా మారింది. ఆమె కన్ను కొట్టిన వీడియో ఇంటర్నెట్ ను ఊపేయడంతో ప్రియా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఆ సినిమా తర్వాత ఒమర్ ‘ధమాకా’, ‘నల్ల సమయం’ అనే సినిమాలు చేశాడు. ఇప్పుడు ఫిర్యాదు చేసిన నటి ఈ సినిమాలో కూడా నటించిందని అంటున్నారు. ‘నల్ల సమయం’ సినిమాలో డ్రగ్స్, మద్యం వాడకాన్ని దర్శకుడు బాగా చూపించారని ప్రశంసలు కురిశాయి. తాజాగా ‘పవర్ స్టార్’ సినిమా చేస్తానని ఒమర్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన అత్యాచారం కేసులో చిక్కుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు