Nayanatara : బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో నయన్ ఛాన్స్ కొట్టేసిన త్రిష… ఇదన్నా వర్కౌట్ అవుతుందా?

Nayanatara : గతంలో నయనతార హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఓ మూవీ సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే సీక్వెల్ లో నయనతార ప్లేస్ ను త్రిష కొట్టేసినట్టు టాక్ నడుస్తోంది. ఇంతకీ ఇదంతా ఏ మూవీ విషయంలో జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే..

అమ్మోరు తల్లి సీక్వెల్

ప్రస్తుతం ఇండస్ట్రీలో పని చేస్తున్న దర్శకుల్లో ఆర్జే బాలాజీ అత్యంత విజన్ ఉన్న దర్శకుల్లో ఒకరు. అతని కాన్సెప్ట్‌లు ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే బాలాజీ తన తదుపరి ప్రాజెక్ట్‌ ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడని గత కొన్ని నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2020లో మూకుతి అమ్మన్‌ పేరుతో నయనతార, బాలాజీ ప్రధాన పాత్రల్లో ఓ మూవీ రిలీజ్ అయ్యింది. తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ ను తెరకెక్కించే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

నయన్ బదులు త్రిష?

తాజా సమాచారం ప్రకారం బాలాజీ మూకుతి అమ్మన్‌లో నయనతార బదులు మరో హీరోయిన్ తో చర్చలు జరుపుతున్నాడని వార్తలు విన్పిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో అమ్మోరుగా నటించి ప్రేక్షకులను మైమరపించిన నయన్ ను కాదని ఇప్పుడు సీక్వెల్ లో ఎవర్‌గ్రీన్ బ్యూటీ త్రిష కృష్ణన్ ను ప్రధాన కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

- Advertisement -

Ammoru Thalli Movie Starring Nayanthara And Rj Balaji Releases Second Song  Bhagavathi Baba - 3Movierulz

ఇదైనా వర్కౌట్ అవుతుందా?

సీనియర్ హీరోయిన్లు అయిన త్రిష, నయన్ మధ్య పోటీ ఎప్పుడూ నడిచేదే. కానీ నయన్ కు సెట్ అయినట్టుగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు త్రిషకు వర్కౌట్ కాలేదు. దీంతో త్రిష మళ్లీ గ్లామర్ బాట పట్టి ఇప్పుడు సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. కానీ మళ్లీ ఇప్పుడు నయన్ రూట్లో, గతంలో ఆమె పోషించిన రోల్ లో త్రిష ఇముడుతుందా? అంటే అనుమానమే. అమ్మోరుగా నయనతార అద్భుతంగా కన్పించింది, నటించింది. మరి ఈ పుకార్ల నేపథ్యంలో త్రిషకు అమ్మోరుగా ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో చూడాలి.

త్రిష లైనప్ లో భారీ సినిమాలు

ప్రస్తుతం త్రిష పైప్ లైన్ లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కమల్ హాసన్ థగ్ లైఫ్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. దర్శకుడు మల్లిడి వశిష్ట  దర్శకత్వంలో పద్మవిభూషణ్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంతో త్రిష తెలుగు పరిశ్రమకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫాంటసీ డ్రామాని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణా రెడ్డి నిర్మించారు. 2025 జనవరి 10న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌లతో పాటు దర్శకుడు మగిజ్ తిరుమేని తెరకెక్కిస్తునా అజిత్ కుమార్ అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ విదాముయార్చిలో కూడా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇవన్నీ కూడా భారీ ప్రాజెక్టులే కావడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు