Prabhas : మరో మూవీకి డార్లింగ్ ముహూర్తం..!

మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు మీద హిట్లు కొట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు మారుతి. ఇతని సినిమాలకి యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే స్టార్ హీరోతోనే సినిమా చేయాలని ఇతను బలంగా ఫిక్స్ అయ్యాడు. ముందుగా చిరంజీవి వద్దకు వెళ్ళాడని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గారని అప్పట్లో వినిపించింది. అయినా మారుతి నిరాశ చెందలేదు. ఏకంగా ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసి అందరికీ షాకిచ్చాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఆల్రెడీ ఆయన ప్రభాస్ కు రూ.75 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు సమాచారం.

ఇక స్క్రిప్ట్ పనులు మొన్నటివరకు మెల్లగా సాగాయి. ఇప్పుడు జోరు పెంచి పూర్తిచేసే పనిలో పడ్డాడు మారుతి. వచ్చే నెలకి స్క్రిప్ట్ ఫైనల్ అయిపోతుంది. ఇక పూజా కార్యక్రమాలు దసరా పండుగ టైంకి జరుగుతాయని సమాచారం. ఈ గ్యాప్ లో ‘సలార్’ ను కంప్లీట్ చేయాలని ప్రభాస్ డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది. సలార్ షూటింగ్ ను పూర్తి చేసి, కేజీఎఫ్ 3 సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రశాంత్ నీల్ చూస్తున్నాడు. కాబట్టి అనుకున్న సమయాని కంటే ముందే సలార్ పూర్తి అయ్యే అవకాశముంది. దీంతో రాజా డిలాక్స్ సెట్స్ పైకి ప్రభాస్ రావడానికి ఎంతో టైమ్ లేదని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు