‘ఎఫ్3’ సక్సెస్ మీట్ వేడుకలో కమెడియన్ అలీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మూవీ హిట్ అయినా కూడా బాలేదు అంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అలీ మాట్లాడుతూ.. ” ‘ఎఫ్3’ ని సూపర్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఈరోజు నిజంగా పండగు రోజు లాంటిది. సోమవారం రోజున కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్స్ తో మా మూవీ దూసుకుపోవడానికి కారణం ఈ బ్యానర్ కు ఉన్న విలువ, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేష్, వరుణ్‌తేజ్ పై ఉన్న నమ్మకం. సినిమా బాగుంటే దాన్ని పెద్ద హిట్ చేస్తారు ప్రేక్షకులు అనడానికి ‘ఎఫ్3’ నిదర్శనం. చాలా మంది ఫోన్లు చేసి ఈ సినిమాని రెండు, మూడు సార్లు చూశామని చెబుతున్నారు.
సినిమా హిట్ అయితే అందరూ బాగుంటారు. కొంతమంది హిట్ అయినా సినిమాను బాలేదని ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం సరైంది కాదు. గతంలో చెన్నైలో ఉండగా ఇలాంటి వార్తలు వినిపించేవి కాదు. ఒకరి సినిమా హిట్ అయితే మరొకరు బాధపడడం ఏమిటో అర్థంకాదు. అవతలివారు బాగుండాలి అని కోరుకుంటే దేవుడు మనల్ని బాగా చూస్తాడు” అంటూ చెప్పుకొచ్చారు.