Anushka Shetty : అనుష్కను వీడని బరువు సమస్య

‘సైజ్ జీరో’ చిత్రం కోసం అనుష్క బరువు పెరిగింది. ఆ సినిమాని ఎంతో ఇష్టపడి చేసింది. కానీ ఆ మూవీ హిట్ అవ్వలేదు.పైగా అనుష్క పై ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆ సినిమా టైం నుండీ అనుష్క షేపౌట్ అవుతూనే ఉంది. ‘నిశ్శబ్దం’ చిత్రం కోసం కష్టపడి వెయిట్ తగ్గింది కానీ ఆ మూవీ ఓటీటీకే పరిమితమైంది. కరోనా లాక్ డౌన్ వల్ల అనుష్క మళ్ళీ బరువు పెరిగింది. అందుకే ఆమె పోస్ట్ చేసే ఫొటోలు మొహం మాత్రమే కనిపించేలా తీసుకుంటుంది. సినిమా కోసం బరువు తగ్గమని ఏ దర్శకుడైనా చెబితే ఆ ప్రాజెక్టుని అనుష్క పక్కన పెట్టేస్తుందట.

ఇదిలా ఉండగా.. ‘UV  క్రియేషన్స్’ బ్యానర్లో అనుష్క ఓ సినిమా చేస్తుంది. నవీన్ పోలిశెట్టి ఇందులో హీరో. ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 40 శాతం కంప్లీట్ అయ్యింది కూడా. కానీ అనుష్క మాత్రం ఈ మూవీ షూటింగ్లో జాయిన్ కాలేదు. అందుకు ప్రధాన కారణం ఈమె అధిక బరువుతో ఇబ్బంది పడుతుండడం వలనే అని ఇండస్ట్రీ వర్గాల్లో గుస గుస. ఇటీవల అనుష్క ఆస్ట్రేలియాలో బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకుందట. కానీ అది ఆ ట్రీట్మెంట్ వర్కౌట్ కాకపోవడంతో, సహజమైన పద్దతిలో బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తుందట. అందుకోసం 2 నెలల వరకు టైం పడుతుందని సమాచారం. అప్పటి వరకు షూటింగ్ కు దూరంగా ఉండాలని అనుష్క నిర్ణయం తీసుకుందని టాలీవుడ్ లో విపిసిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు