Prabhas Movies Update : కల్కికి గుమ్మడికాయ కొట్టే టైం వచ్చేసింది… మరో అప్డేట్ కూడా

Prabhas Movies Update : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి, రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా నటిస్తున్న ఈ రెండు సినిమాలకు సంబంధించిన రెండు అదిరిపోయే అప్డేట్ లు వచ్చేశాయి. ప్రభాస్ అభిమానుల్లో జోష్ పెంచే ఆ అప్డేట్స్ ఏంటంటే ఒక సినిమాకు గుమ్మడికాయ కొట్టబోతున్నాడని సమాచారం. అలాగే మరో సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది. మరి ప్రభాస్ కల్కి, రాజా సాబ్ సినిమాలు ఎక్కడిదాకా వచ్చాయి? అనే విషయంలోకి వెళ్తే…

ఒక్క దెబ్బకు రెండు అప్డేట్స్…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరియర్ లోని హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడి. ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. ఫిలిం వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈరోజు రాత్రితో కల్కి మూవీ షూటింగ్ పూర్తయిపోతుందని సమాచారం. అందులో భాగంగానే ఏప్రిల్ 10న రాత్రి గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు కల్కి టీం.

కల్కి మూవీని మే 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఎలక్షన్స్ కారణంగా ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అలాగే మే 30ని కొత్త రిలీజ్ డేట్ గా ఫైనల్ చేశారనే టాక్ నడుస్తోంది. మరి గుమ్మడికాయ సెర్మనీకి సంబంధించిన అప్డేట్ లోనే కల్కి రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇక ఈ మూవీ పూర్తవ్వడంతో తన నెక్స్ట్ మూవీపై ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు ప్రభాస్.

- Advertisement -

రాజాసాబ్ అప్డేట్

మారుతి దర్శకత్వంలో హార్రర్ జానర్ లో రాజా సాబ్ అనే మూవీని ప్రభాస్ చేస్తున్న విషయం తెలిసిందే. పనిలో పనిగా ఈ మూవీ అప్డేట్ కూడా బయటకు వచ్చింది. రాజా సాబ్ మూవీ మెయిన్ షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతోందని సమాచారం. ఈ మెయిన్ షెడ్యూల్ లో వచ్చే వారం నుంచి ప్రభాస్ పాల్గొంటారని తెలుస్తోంది. ఒకేసారి ఇలా ప్రభాస్ సినిమాలకు సంబంధించిన రెండు అప్డేట్లు రావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి కల్కి రిలీజ్ డేట్ పై ఉన్న సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి?

ప్రభాస్ సినిమాల విషయానికొస్తే…

ప్రస్తుతం కల్కి మూవీని కంప్లీట్ చేసిన ప్రభాస్ నెక్స్ట్ రాజా సాబ్ ను పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు. మిగతా సినిమాల కంటే ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి కాంబో గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ నటించబోతోంది అని ప్రచారం జరుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు