HBD Poonam panday : మారని పూనమ్.. ఆ రోజు నుండి మొన్నటి వరకూ..

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే గురించి మూవీ లవర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వివాదాలకు కేరాఫ్ గా ఉండే బాలీవుడ్ హీరోయిన్లలో ఈమె ప్రముఖంగా నిలుస్తుంది. ఇండియా వైడ్ గా కూడా సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయిన ఈ భామ నెల కిందయితే ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ కి చెవిలో పువ్వు పెట్టేసింది బోల్డ్ బ్యూటీ… దాని గురించి అందరికి తెలిసిందే గా. అయితే పేద కుటుంబం నుండి వచ్చిన పూనమ్ పాండే హీరోయిన్ గా మారడానికి చాలా కష్టాలు పడిందని అంటూ ఉంటారు ఆమె సన్నిహిత వర్గాలు. బాలీవుడ్ లో నషా అనే సినిమాతో ఫేమ్ సాధించిన ఈ భామ ఇండియా వైడ్ గా వైరల్ అయింది మాత్రం ఒక స్టేట్మెంట్ తోనే..

కప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతానని..

బాలీవుడ్ లో వివాదాల్లో ఉండే పూనమ్ పాండే కెరీర్ బిగినింగ్ స్టేజి లో ఉండే టైం లో నేషనల్ వైడ్ గా వార్తల్లో నిలిచింది మాత్రం 2011 వరల్డ్ కప్ టైం లో. ఇండియా 2011 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ టైం లో మ్యాచ్ జరగడానికి ఒకరోజు ముందు పూనమ్ పాండే క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే తాను టీమ్ ఇండియా కోసం గ్రౌండ్‌లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత కప్ గెలవడంతో ఆమె తన మాట నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నాన్ని బీసీసీఐ అడ్డుకుంది. అప్పుడు పూనమ్ పాండే వయసు కేవలం వయసు 19 సంవత్సరాలు.

- Advertisement -

IPL జట్టుకోసం న్యూడ్ పోస్ట్..
పూనమ్ పాండే 2011 లో వరల్డ్ కప్ ప్రయత్నం పాలించకపోయినా, ఆ తర్వాత సంవత్సరం లో తనకు ఎంతో ఇష్టమైన IPL జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత, పూనమ్ పాండే సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటో పోస్టు చేసి సంచలనం సృష్టించింది.

కోవిడ్ టైం లో అరెస్ట్..

పూనమ్ పాండే నాలుగేళ్ళ కిందట కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో పూనమ్ పాండే, ఆమె భర్త నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు రావడంతో పోలీసులు వీరిని అరెస్టు చేసారు. కోవిడ్ సమయంలో బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించిన వీరిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే 2021 లో పాండే తన భర్తపై ఏకంగా గృహహింస కేసు పెట్టింది. దాంతో అతనిని అరెస్టు చేసారు. అంతే కాదు అంతకు ముందు కూడా 2017 లో పూనమ్ పాండే ‘పాండే యాప్’ ప్రారంభించగా, కంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ గూగుల్ ఒక గంటలోపే ప్లే స్టోర్ నుండి యాప్‌ను నిషేధించింది.

చనిపోయిందంటూ చెవిలో పువ్వు..

లాస్ట్ ఇయర్ లాక్ అప్ రియాల్టీ షోలో చివరగా కనిపించిన పూనమ్ పాండే ఒక్కసారిగా గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే చనిపోయిందంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేశారు. పూనమ్ పాండే మేనేజర్ పరుల్ చావ్లా ఆమె పోస్ట్ ని పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ తో చాలా మంది మూవీ లవర్స్ ఆమె పై జాలిపడ్డారు. బాధపడ్డారు. కానీ అంతలోనే పూనమ్ బతికే ఉన్నానంటూ, కాన్సర్ బారిన పడకుండా ఉండే వారికి అవగాహన కోసం ఇలా చేశామంటూ పూనమ్ పాండే తెలిపింది. ఆ తర్వాత పూనమ్ చేసిన పనికి ఆమె చావు వార్తపై బాధపడ్డవారు కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు