టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే కి చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆమె చాలా బాధ పడినట్లు తెలియజేసింది. అసలు విషయం ఏంటంటే ఇండిగో ఫ్లైట్ లో పూజా ప్రయాణిస్తున్న సమయంలో చేదు అనుభవం ఎదురైంది. పూాజాతో ఇండిగో స్టాఫ్ లో ఒకరైన విపుల్ నకాషే చాలా అనుచితంగా ప్రవర్తించాడట. ఎలాంటి కారణం లేకుండా ఆమె పై పొగరుగా, దురుసుగా, మొరటుగా ప్రవర్తించాడట. దీనికి పూజా హెగ్డే చాలా డిజప్పాయింట్ అయినట్టు తన ట్విట్టర్ వేదిక తెలిపింది. ఇలాంటి విషయాలు ట్విట్టర్లో షేర్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఈ ఘటనతో ఎంతో భయపడినట్టు తెలిపింది. అందుకే చెప్పాల్సివచ్చిందని వివరించింది. ఇదిలా ఉండగా దీనిపై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. అంతే కాకుండా హీరోయిన్ పూజా హెగ్డే కు క్షమాపణలు తెలిపారు.
అయితే ‘సెలబ్రిటీలు ఇలాంటి చిన్న విషయాలను హైలెట్ చేస్తూ ట్వీట్లు వేయడం మామూలే. గతంలో కూాడా పలువురు సెలబ్రిటీలు ఇలాగే హాంగామా చేశారు. కాగ దీనిపై నెటిజన్లు నుండి మిశ్రమ స్పందన వస్తుంది. కొంతమంది నెటిజన్లు ఆ ఎంప్లాయ్ ఉద్యోగం పోయేలా ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని ఇండిగో యాజమాన్యాన్ని కోరుతున్నారు. అలాగే మరి కొందరు పూజాకు మద్దత్తు తెలుపుతున్నారు.