NBK 107 Teaser : ఫ్యాన్స్ కు స్టఫ్.. మిగిలిన వాళ్లకు టఫ్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా, దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్.బి.కె 107’ నుండి ఫస్ట్ హంట్ పేరుతో ఓ టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ లో..
బ్లాక్ డ్రెస్ లో బాలయ్య మాస్ లుక్ లో కనిపించాడు. ‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్’, ‘భయం నా బయోడేటాలోనే లేదురా బోసు డీకే’ ‘నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకి కూడా తెలీదు నా కొడకల్లారా’ లాంటి మాస్ డైలాగులు బాలయ్య అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కానీ, బాలయ్య చెప్పిన డైలాగులు బోయపాటి స్టైల్ నే గుర్తుచేస్తుంది. బోయపాటి మార్క్ సినిమాలనే ఉంది, గోపీచంద్ మలినేని మార్క్ కనిపించలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు. అయినప్పటికీ బాలయ్య ఫ్యాన్స్ కు మాస్ ఆడియన్స్ కు కావాల్సిన బాలయ్య ఇలాగే ఉండాలి. ఇది చాలు బాక్సాఫీస్ పై బాలయ్య దండయాత్ర చేయడానికి. కాకపోతే మిగిలిన ఆడియన్స్ ను ఈ టీజర్ ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది పెద్ద ప్రశ్నగానే ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు