నందమూరి బాలకృష్ణతో దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా సన్నిహితంగా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ కు ఎటువంటి అవసరం వచ్చినా బాలయ్య అండగా నిలబడుతున్నారు. తాజాగా పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ‘చోర్ బజార్’ చిత్రం ట్రైలర్ ను బాలయ్య విడుదలనే చేశారు.’దళం’, ‘జార్జి రెడ్డి’ వంటి చిత్రాలను తెరకెక్కించిన జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీని ‘ఐ.వి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వీ.ఎస్ రాజు నిర్మించారు.త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది.
ఇక ట్రైలర్ లాంచ్ అనంతరం.. ‘చోర్ బజార్’ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘పైసా వసూల్’ చిత్రం నుండి పూరి జగన్నాథ్ గారి కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడిందని బాలయ్య తెలియజేసారు. అనంతరం బాలయ్య కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మన తెలుగు వారికి సినిమా కూడా నిత్యావసరమే. కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ సినీ పరిశ్రమ ఊపందుకుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. నిజమే బాలయ్య చెప్పినట్టు.. తెలుగు జనాలకి సినిమా అంటే ఒక నిత్యావసర వస్తువులాంటిదే..!