Pawan Kalyan : “నానికి మా ఇంట్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు”

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుంద‌రానికీ’. మరికొన్ని గంటల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఈ రోజు సాయంత్రం నిర్వహించారు మేకర్స్. హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం అందరూ వేడుక ఆరంభం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు ప్రేక్షకులు. పవన్ కళ్యాణ్ 10 నిమిషాలకి పైగా మాట్లాడారు కానీ, నాని పై పవన్ చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

నాని అంటే తనకు చాలా అభిమానం అని చెప్పుకొచ్చారు పవన్. నాని ఏ విషయం పై అయినా బలంగా నిలబడతారు అని చెప్పుకొచ్చాడు. గతంలో థియేటర్ ల గురించి, టికెట్ రేట్ల గురించి ఏపీ ప్రభుత్వం తీరుని ప్రశ్నించిన నాని, ఘోరంగా విమర్శల పాలయ్యాడు. అతని సినిమాని ఏపీలో అడ్డుకున్నారు. సక్సెస్ మీట్ లు కూడా పెట్టనివ్వలేదు. అయినా ఆ సినిమా బాగానే ఆడింది. అందుకే నాని బలంగా నిలబడతారు అని పవన్ చెప్పి ఉండచ్చు అని పలువరు అభిప్రాయపడుతున్నారు.

అలాగే నానికి తన ఫ్యామిలీలో కూడా అభిమానులు ఉన్నారని. అతని విలక్షణ నటనని ఇష్టపడతారని చెప్పుకొచ్చారు పవన్. తన అక్క వాళ్ళు కూడా నాని సినిమాలకి వెళ్లడం పవన్ చూశాడట. నిజమే నానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు