Polimera-2: పొలిమేర -2 ప్రీ రిలీజ్ ఈవెంట్, చీఫ్ గెస్ట్స్ ఎవరంటే.?

రోజులు మారుతున్న కొద్ది పరిస్థితులు మారుతాయి అంటారు. అలానే సినిమా ఇండస్ట్రీ కూడా చాలా మార్పులు జరిగాయి. ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమా అన్న, తమిళ్ సినిమా అన్న ఎక్కడ దూరంగా ఉండేది. కానీ ఈరోజు ఏ భాషలోనైనా ఏ గొప్ప సినిమా ఉన్న అర్థం కాకపోయినా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి చూసే ఆడియన్స్ ఉన్నారు. ఒకప్పుడు ప్రపంచ సినిమా చూడటానికి యాక్సిస్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రపంచ సినిమా కూడా మన చేతిలో ఉన్న ఫోన్లో ఉంటుంది. టెక్నాలజీ అంతగా డెవలప్ అయింది.

అందుకే ఇప్పుడు రీమిక్ సినిమాల్ని తిప్పికొడుతుంటారు కొంత శాతం మంది ఆడియన్స్. ఇంకా కరోనాకాలంలో ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితమయ్యారు. ఆ టైంలో ప్రపంచ సినిమాలన్నిటిని ఒకేసారి చూడటం మొదలుపెట్టారు. ఇల్లు దాటి కదిలే పని లేదు కాబట్టి ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఒకటే కాబట్టి అందరూ అన్ని భాషల్లో ఉన్న గొప్ప సినిమాలను చూస్తూ కాలాన్ని గడిపారు.

అయితే ఓటిటిలో తెలుగు నుంచి కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు నిరాశపర్చాయి, ఇంకొన్ని సినిమాలు అద్భుతం అనిపించాయి. మరికొన్ని చిన్న సినిమాలు కూడా అరెరే భలే ఉందనే ఫీలింగ్ ని తీసుకొచ్చాయి. అందులో అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన “పొలిమేర” ఒకటి. ఈ పొలిమేర సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఈ సినిమాను చూసిన చాలా మంది తెలుగు ప్రేక్షకులకు కి మంచి కిక్కు వచ్చింది.

- Advertisement -

ఓటిటిలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం వలన పొలిమేర-2 థియేటర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. నేడు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ హీరో అడవి శేషు హాజరుకానున్నాడు. పొలిమేరలో సత్యం రాజేష్ సరసన కామాక్షి భాస్కర్ల నటిస్తోంది. ఈ సినిమాలో మూఢనమ్మకాలు, పొలిమేరలో ఉండే దేవతలు వాటి గురించి చూపిస్తారు. అయితే పొలిమేరకు మించి పది రేట్లు పొలిమేర-2 ఉంటుందని ఇదివరకే మేకర్స్ పలు ఇంటర్వ్యూలో చెప్పారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు