Pawan Kalyan: తమిళ హీరోలకు కూడా పవనే దేవుడా !?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ రోజురోజుకూ మరింతగా పెరిగిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ లో ఆయనను కేవలం ఒక హీరో గానే కాకుండా దేవుడిగా కొలిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో తమ సినిమాల కోసం పవన్ కళ్యాణ్ పేరును మిడ్ రేంజ్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎంతోమంది వాడుకుంటూనే ఉంటారు. తమ సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్లకు పవర్ స్టార్ ను ఆహ్వానించడం లాంటి వాటితో పాటు, పలు వేదికలపై తాము పవన్ కళ్యాణ్ కు డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ ఎంతోమంది హీరోలు చెప్పుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి.

హీరో నితిన్ కూడా ఈ కోవకు చెందినవాడే. ఈ తరం మెగా కాంపౌండ్ హీరోలతో పాటు పలువురు యంగ్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును తమ సినిమాల ప్రమోషన్స్ కోసం ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటూనే ఉన్నారు. ఆయన క్రేజ్ అలాంటిది మరి. అయితే తాజాగా వచ్చిన “జపాన్” మూవీ చూస్తుంటే తమిళ హీరోలకు కూడా పవనే దేవుడా? అనుమానం వస్తోంది.

దీపావళి కానుకగా తమిళ హీరో కార్తీ నటించిన “జపాన్” మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీ విడుదల కాగా, సినిమాలో పవన్ రిఫరెన్స్ గట్టిగానే ఉన్నట్టుగా “జపాన్” మూవీ చూసిన వాళ్ళు చెబుతున్నారు. “జపాన్” సినిమాలో పదేపదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడంతో పాటు “అజ్ఞాతవాసి” పోస్టర్ ను కూడా ప్రదర్శించారట. ఇక ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్లు పవర్ స్టార్ ను వాడుకున్నారంటే ఓకే… మరి అజ్ఞాతవాసి పోస్టర్ ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

అయితే సినిమాలో కీలక ట్విస్ట్ అక్కడే ఉంటుందని సమాచారం. మొత్తానికి ఈ స్టంట్ తో మేకర్స్ ముఖ్యంగా పవన్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్నమాట. దీంతో పవర్ స్టార్ బ్రాండ్ అలాంటిది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం అందుకే ఈ సినిమా టాక్ కూడా అజ్ఞాతవాసి టాక్ లాగే నడుస్తోందంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు “జపాన్” మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ లభిస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు