ఓవర్ నైట్ స్టార్డం కాదు

ఒన్ డే లో స్టార్ అంటే అది చూసేంత ఈజీ కాదు
ఎన్నో ఏళ్ళ కన్నీళ్ల కష్టం ఉంది అని ఒక పాటలో రాసారు భాస్కరభట్ల.
ఈ మాటలు విజయ్ దేవరకొండ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అనిపిస్తుంది. అందరు సినిమాలు చూస్తారు, కొందరు మాత్రమే సినిమాలు తియ్యాలి అనుకుంటారు, ఇంకొందరు సినిమాలలో కనిపించాలి అనుకుంటారు.
సినిమాలలో కనిపించాలి అనుకుంటే కొంచెం కష్టపడితే చాలు,
కానీ హీరోగా నిలబడాలి అంటే కొంచెం కష్టం మాత్రమే సరిపోదు.
అలుపెరుగని శ్రమ, ఆవగింజ అదృష్టం కూడా ఉండాలి.

నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ , ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలలో చిన్న చిన్న రోల్స్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడొక స్టార్ హీరో. ఆయన డేట్స్ కోసం వెయిట్ చేసే ప్రొడ్యూసర్స్ , డైరెక్టర్స్ ఉన్నారు ఇప్పడు.

అందరు అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ అంటారు, కానీ ఆ ఓవర్ నైట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిచి ఉంటాయి విజయ్ లైఫ్ లో. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉన్నాడు.
పూరి తో లైగర్ సినిమాను కంప్లీట్ చేసిన విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమాని చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తరువాత మళ్ళీ పూరి దర్శకత్వంలోనే “జనగణమన” సినిమాని చేయనున్నాడు. ఇప్పటివరకు చాలా ఇంటర్వూస్ లో “జనగణమన” గురించి గొప్పగా చెప్తూ వచ్చాడు పూరి, ఈ సినిమా విజయ్ కి పడి వర్కౌట్ అయితే తన కెరీర్ లో ఇంకో మెట్టు ఎక్కినట్లే.

- Advertisement -

ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండా తనని తాను నమ్ముకుని
ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ తో సొంత ప్లాట్ఫ్రామ్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్.
కేవలం సినిమాలుని మాత్రమే ప్రోమోట్ చేయడమే కాకుండా
అటు ఓన్ బిజినెస్ అయినా రౌడీ వేర్ కూడా గట్టిగ ప్రోమోట్ చేస్తున్నాడు,రీసెంట్ గా థియేటర్ ను కూడా నిర్మించి తన పర్సనల్ లైఫ్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో.
ఇలానే మంచి సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో మరింత ముందుకు వెళ్లాలని తెలుపుతూ హ్యాపీ బర్త్ డే టూ విజయ్ దేవరకొండ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు