Niharika: ఆ రోజు రాడిసన్ పబ్ లో జరిగిందిదే.. అన్యాయంగా..!

గడిచిన కొన్ని నెలలుగా మెగా డాటర్ నిహారిక నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది.. ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్య తో విడాకుల అనంతరం మళ్లీ తిరిగి నటించేందుకు సిద్ధమవడంతో పాటు తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్ పైన కూడా పలు సినిమాలను, వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తూ బిజీగా మారిపోయింది. అయితే నిహారిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు పలు విషయాలను కూడా వెల్లడించింది.. ఈ వ్యాఖ్యలతో మరొకసారి నిహారిక సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది అని చెప్పవచ్చు.

రాడిసన్ పబ్ లో జరిగింది ఇదే..
ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె రాడిసన్ పబ్ లో ఆరోజు జరిగిందేంటో వెల్లడించింది…పబ్ లో జరిగిన విషయం గురించి.. తనను ఎందుకు అరెస్టు చేశారనే విషయం గురించి పూర్తిగా వివరించింది.నిహారిక మాట్లాడుతూ.. రాడిసన్ బ్లూ పబ్ కేసులో నన్ను చాలా అన్యాయంగా ఇరికించారు.. నేను పబ్ లకు వెళ్ళను. కానీ అప్పుడప్పుడు స్నేహితులు బలవంతం చేస్తే పబ్ లకి పార్టీలకు చాలా తక్కువగా వెళ్తాను.. ఆ రోజు నేను నా స్కూల్ ఫ్రెండ్ ను కలిసేందుకు వెళ్లాను..దాదాపుగా ఆరు నెలల తర్వాత మేము కలిసి కబుర్లు చెప్పుకున్నాము.. అయితే అక్కడ సౌండ్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది.. అందుకే వెంటనే ఇంటికి వెళ్లి పోదామని బిల్లు కట్టేందుకు బయటకు వచ్చే సమయానికి అక్కడికి పోలీసులు వచ్చేసారు అంటూ తెలిపింది.

అందరితో పాటు మమ్మల్ని కూడా స్టేషన్ కి పిలిపించారు… అయితే దీనిపై మీడియా వారు నానా రచ్చ చేశారు.. నాకు ఏమీ అసలు అర్థం కాలేదు.. చాలా బాదేసింది.. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే అక్కడెవరో డ్రగ్స్ తీసుకున్నారని.. అందుకే పోలీసులు రైడ్ చేశారు. అప్పుడే నాకు అర్థం అయ్యింది..తప్పుడు ప్రదేశంలో ఉన్నానని చాలా లేటుగా తెలుసుకున్నాను.. అంటూ నిహారిక వెల్లడించింది. మొత్తానికి అయితే తాను అరెస్ట్ అవడం వెనుక ఉన్న అసలు నిజం ఇదే అంటూ వెల్లడించింది నిహారిక.

- Advertisement -

పిల్లలపై స్పందన..
ఇకపోతే తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటారా అనే విషయంపై కూడా కామెంట్లు చేసింది.. ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ రెండో పెళ్లి పై ఎటువంటి అభ్యంతరం లేదని కానీ పిల్లల్ని కనాలనే ఆలోచన ఎక్కువగా ఉందంటూ ఆమె స్పష్టం చేసింది. పిల్లల్ని కనడం అంటే చాలా ఇష్టమని.. ఆ ఇష్టం కోసమైనా రెండో పెళ్లి చేసుకుంటానని నిహారిక ఇటీవల వెల్లడించింది.. అయితే డైరెక్ట్ గా మాత్రం ఎప్పుడు నిహారిక తన పెళ్లి, విడాకులు, పబ్ లో జరిగిన విషయం పైన కూడా ఎప్పుడు మాట్లాడలేదు.. కేవలం సోషల్ మీడియా ద్వారానే ఆమె ఈ విషయాలను వెల్లడించింది. మొత్తానికి అయితే రూమర్స్ విషయాలపై క్లారిటీ ఇచ్చేసింది..

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు