RRR – Pushpa Movies: తెలుగు సినిమాలపై బాలీవుడ్ మరోసారి విషం

RRR – Pushpa Movies

టాలీవుడ్‌ క్రేజ్ ఈ మధ్య కాలంలో ప్రపంచ స్థాయికి చేరింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి సినిమాలు సినీ ప్రపంచాన్ని తెలుగు చిత్ర సీమ వైపునకు తిరిగి చూసేలా చేశాయి. దీంతో భారతీయ సినిమా అంటే.. టాలీవుడ్ అని చెప్పుకునే రేంజ్ వరకు వెళ్లింది. అయితే దీన్ని బాలీవుడ్ వాళ్లు ఏ మాత్రం సహించడం లేదు. సమయం దొరికినప్పుడల్లా… టాలీవుడ్ పై విషం కక్కుతూనే ఉన్నారు.

ఇప్పటికే బీ టౌన్‌లో ఉన్న ప్రముఖులు తెలుగు సినిమా విజయాలపై అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా కూడా తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కడం స్టార్ట్ చేశాడు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని పొంది, ఎన్నో రికార్డులు, అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలను తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పాడు. అంతే కాదు, ఒక సారి చూడాలని ట్రై చేస్తే, సినిమా మొత్తం చూడలేకపోయాను అంటూ కూడా కమెంట్స్ చేశాడు. ఇలాంటి సినిమాలను ఎవరైనా చూస్తారా? అంటూ పొగరు మాటలు కూడా మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలపై ప్రశంసలు కురిపిస్తే, నసీరుద్దీన్ షా కి ఏమైంది అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

- Advertisement -

మంచి సినిమాలను ఎంకరైజ్ చేయాలి కానీ, ఇలా మాట్లాడి తమ పరువు తీసుకోవద్దని అంటున్నారు. అయినా, బాలీవుడ్‌కి చెందిన వాళ్లు తెలుగు సినిమాలను చిన్న చూపుతో చూడటం ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన సినిమాలను ఇలాగే అవమానిస్తూ మాట్లాడారు.

అలా అని అందరూ బాలీవుడ్ స్టార్స్ తెలుగు సినిమాలను అవమానించడం లేదు. కొంత మంది డైరెక్ట్ గా హిందీ సినిమాల కంటే, తెలుగు సినిమాలు నార్త్‌లో ఎక్కువ ఆడుతున్నాయని, టాలీవుడ్ నుంచి క్వాలిటీ సినిమాలు వస్తున్నాయని చెబుతున్నారు. కానీ, నసీరుద్దీన్ షా లాంటి కొంత మంది మాత్రమే తెలుగు ఇండస్ట్రీపై వక్ర బుద్దిని చూపిస్తున్నారు.

అయినా, ఇలాంటి వాళ్లు ఏదో అన్నంత మాత్రాన టాలీవుడ్‌కి వస్తున్న గౌరవం ఉన్నట్టుండి పడిపోదు. అలాగే వచ్చిన అవార్డులు, రివార్డులు రిటర్న్ పోలేవు అంటూ నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు