Manam : కల్ట్ క్లాసిక్ ని రీమేక్ కోసం.. ఎన్ని కోట్లు ఇచ్చినా నో అన్నారు.. ఎందుకో తెలుసా?

Manam : టాలీవుడ్ లోనే కాకుండా ఈ మధ్య అన్ని భాషల్లోనూ రీమేక్ సినిమాలు బాగా చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో ఈ ఏడాది ఒక్క హిట్ సినిమా కూడా లేకపోయే సరికి ఒక గుజరాతి సినిమాని రీమేక్ చేసి సైతాన్ సినిమాతో బాలీవుడ్ కి ఊపిరి పోశారు మేకర్స్. ఇదిలా ఉండగా
మామూలుగా ఒక భాషలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా అంటే చాలు ఇతర ఇండస్ట్రీలలో, ఆ సినిమాను రీమేక్ చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతాయి. ఇది చాలా కామన్. అయితే రొటీన్ మూవీస్ ని పెద్దగా పట్టించుకోరు కానీ, ఆ సినిమా కనుక బ్లాక్ బస్టర్ క్లాసిక్ అయితే మట్టుకు ఈ సినిమాను తమ ఆడియన్స్ కి కూడా అందించాలి అని మేకర్స్ అనుకుంటారు. నిర్మాతలు, దర్శకులతో పాటు, పలువురు హీరోలు కూడా అలాంటి సినిమాలతో డబ్బులు మరింతగా సంపాదించాలని చూస్తారు. పైగా ప్లాపుల్లో ఉన్న హీరోలు సేఫ్ జోన్ లో హిట్ కొడదామని రీమేక్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే టాలీవుడ్ లో ఓ క్లాసిక్ బ్లాక్ బస్టర్ మూవీ విషయంలో మాత్రం క్లాసిక్ హిట్ గా నిలిచినా కూడా, ఇతర భాషల్లో ఎక్స్ లెంట్ రీమేక్ ఆఫర్స్ వచ్చినా కూడా ఆ సినిమాను ఎట్టి పరిస్థితులలో రీమేక్ చేయనివ్వని నిర్ణయం తీసుకున్నారు.

Nagarjuna said no to remake the movie Manam

ఎవ్వరడిగినా కల్ట్ క్లాసిక్ రీమేక్ కి నో..

ఇక ఆ నిర్మాత కం హీరో ఎవరో కాదు కింగ్ నాగార్జున. ఆ సినిమా మరేదో కాదు 2014 టైంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన “మనం.”(Manam). ఈ సినిమా రిలీజ్ టైం నుండి కూడా ఇతర ఇండస్ట్రీల యాక్టర్స్ ఈ సినిమాను రీమేక్ చేయాలని బాగానే ట్రై చేశారు. బాలీవుడ్, కోలీవుడ్ ల నుండి కోట్లకు కోట్లు గుమ్మరిస్తామని నిర్మాతలు ఆఫర్లు ఇచ్చారు. కానీ ససేమిరా అన్నాడు నాగ్. దానికి కారణం ఉంది. ఎందుకంటే ఇది లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చివరి సినిమా అవ్వడం, అందునా తమ ఫ్యామిలీ మొత్తం ఇందులో నటించడంతో ఇది ఒక తీపి గుర్తుగా నిలిచిపోవాలని ఎట్టి పరిస్థితులలో ఈ సినిమా రీమేక్ లు లాంటివి ఉండవని నాగార్జున చెప్పారు. దాంతో ఇతర ఇండస్ట్రీల వాళ్ళు ఈ క్లాసిక్ రీమేక్ ను మిస్ చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనివ్వనని కూడా అన్నారు.

- Advertisement -

కాన్సెప్ట్ ఫ్రీమేక్ చేద్దామన్న వర్కౌట్ కాలేదు..

అయితే మనం సినిమా రీమేక్ రైట్స్ ఇవ్వకపోవడంతో సినిమా తీయడానికి ఎవరికీ సాధ్యం కాలేదు. అయితే మధ్య మధ్యలో ఈ సినిమా కాన్సెప్ట్ పోలి కొన్ని సినిమాలు ఇతర భాషల్లో రూపొందించాలని ట్రై చేశారు కానీ స్టార్ కాస్ట్ పెర్ఫెక్ట్ గా సెట్ అవ్వక అవేవి కార్యరూపం అయితే దాల్చలేదు. హిందీలో భారీ ఎత్తున ఈ సినిమా రీమేక్ కోసం ట్రై చేసినా రీమేక్ కి నో చెప్పడంతో ‘మనం ‘ANR గారి చివరి తీపి గుర్తుగా అలానే నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. ఇక తాజాగా ‘మనం’ సినిమా రిలీజ్ అయి పదేళ్ళయిన సందర్బంగా తెలుగు రాష్ట్రాలలో పలు థియేటర్లలో మే 23న గ్రాండ్ గా రీ రిలీజ్ అయింది ఈ సినిమా. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ కి రెస్పాన్స్ కూడా అదిరిపోయిందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు