Kalki 2898 AD: కల్కిని ఇంతమంది స్టార్స్ వదులుకున్నారా… అందరికీ ఒకటే ఇబ్బంది..!

Kalki 2898 AD.. సాధరణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే దర్శకులు కథను రూపొందించుకునేటప్పుడు ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని కథలు తయారు చేస్తూ ఉంటారు.. అయితే ఆ కథలను ఆ హీరోలకు వినిపించినప్పుడు వారికి నచ్చకో లేక నచ్చీ టైం కుదరకో లేక మరికొన్ని సందర్భాలలో సినిమా కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు.. అలా ఆ కథ ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది.. అయినా సరే మరి కొంతమంది ఆ కథలను వదులుకుంటూ ఉంటారు.. అలా ప్రస్తుతం అందరి చూపు ఒకే ఒక చిత్రం పై.. అదే కల్కి 2898AD.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ఏడి.. ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా పైనే.. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొంతమంది దురదృష్టవంతులు వదులుకున్నారు.. అంతేకాదు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందరూ ఒకే రీసన్ తో రిజెక్ట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Kalki 2898 AD: Kalki has been abandoned by so many stars... everyone has the same problem..!
Kalki 2898 AD: Kalki has been abandoned by so many stars… everyone has the same problem..!

బుజ్జి ని పరిచయం చేసిన ప్రభాస్..

ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ని రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించగా.. చాలా గ్రాండ్ గా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు..ఈ ఈవెంట్ లో ప్రభాస్ తన బుజ్జిని కూడా పరిచయం చేశారు .చాలా స్టైలిష్ గా ట్రెండీగా ప్రభాస్ బుజ్జి ఉండడం తో బుజ్జి కోసమైనా సినిమాని చూడాలి అంటూ అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరో హీరోయిన్ల కు మించి బుజ్జి పెర్ఫార్మెన్స్ ఉండబోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా కథను మొదట నాగ్ అశ్విన్ కొంతమంది హీరోలకు వినిపించారట. కానీ వారు ఒకే రీసన్ చెప్పి తప్పించుకున్నారు. మరి కల్కి 2898 ఏడి చిత్రాన్ని ఎవరెవరు వదులుకున్నారో ఇప్పుడు చూద్దాం

కల్కి చిత్రాన్ని వదులుకున్న స్టార్స్ వీళ్ళే..

ఎన్టీఆర్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మొదట ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నారట.. ఎన్టీఆర్ కి కథ కూడా వినిపించారట.. కానీ ఎన్టీఆర్ కొన్ని కారణాలు చేత ఈ సినిమాను రిజెక్ట్ చేయడం జరిగింది.. అయితే ఎన్టీఆర్ ఇలా రిజెక్ట్ చేయడానికి కారణం ఇలాంటి కాన్సెప్ట్ జనాలు ఇష్టపడతారో లేదో అన్న ఒక అపోహలోనే సినిమాను రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళగా రామ్ చరణ్ ఇప్పటికే రెండు సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు.. పైగా ఆయన కూడా ఇలాంటి అపోహ లోనే సినిమాని రిజెక్ట్ చేశారట. ఇక వీరితో పాటు సూర్య, మహేష్ బాబు, రాణా దగ్గుబాటి లాంటి స్టార్ హీరోలకి కూడా ఈ కథ వినిపించారట.. కానీ అందరూ కూడా ఒకే తరహా రీసన్ చెప్పి సినిమాని రిజెక్ట్ చేశారట..

- Advertisement -

కల్కి 2898 AD..

ఇక చివరిగా ప్రభాస్ ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు.. నాగ్ అశ్విన్ చెప్పగానే ఓకే చేసి సినిమాకి సైన్ కూడా చేసేశాడట. ఇక ఇటీవలే కీర్తి సురేష్ కూడా బుజ్జి క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ కంప్లీట్ చేసింది.. ఇక ఇందులో దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు