Kalki: కల్కి సినిమా బుజ్జి వెహికల్ లో నాగచైతన్య రైడ్

Kalki: ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి ప్రభాస్ కు ఉన్న మార్కెట్ అలానే నాగ అశ్విన్ విజన్. నాగ్ అశ్విన్ కు ఉన్న సక్సెస్ ట్రాక్ ఇవన్నీ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతున్నాయి. వీటన్నిటిని మించి ఈ సినిమా భారీ బడ్జెట్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉండటంతో ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

దగ్గరుండి క్రియేట్ చేసాడు

కల్కి సినిమా నుంచి ఒక వెహికల్ ని క్రియేట్ చేసి రివిల్ చేశారు. ప్రభాస్ ఈ వెహికల్ లోనే ఈవెంట్ కి ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రభాస్ ఎంట్రీ కి ఆడియన్స్ అంతా ఎంత ఫిదా అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే బుజ్జి అయితే మాత్రం చాలామందికి నచ్చింది. ఇక పోతే ఈ బుజ్జి అనే పేరు చిన్నది కావచ్చు కానీ బుజ్జి పాత్ర సినిమాలో చాలా పెద్దగా ఉంటుంది అని నాగ్ అశ్విన్ చెప్పాడు. అయితే ఈ వెహికల్ ని ఆటోమొబైల్ ఇంజనీర్స్ తో కలిసి చేయించాడు నాగ అశ్విన్. దీని వెనుక దాదాపు ఏళ్ల కష్టం ఉంది.

Naga Chaitanya's expensive car & bike collection in Hyderabad

- Advertisement -

బుజ్జితో నాగచైతన్య

స్వతహాగా నాగచైతన్య కి కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ వెహికల్ ని కూడా నాగచైతన్య డ్రైవ్ చేశాడు. నాగ చైతన్యకి కార్లు పైన ఇష్టం గురించి చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలుసు. రోడ్డు మీద కారుతో రయ్ రయ్ అని దూసుకెళ్తుంటాడు చెయ్. లేకపోతే ఇంజనీర్స్ అందరు కలిసి చేసిన ఈ బుజ్జిని కూడా డ్రైవ్ చేశాడు నాగచైతన్య. నాగచైతన్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ లో ఉన్న రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేసి ఈ వెహికల్ ని డిజైన్ చేసినట్లున్నారు అంటూ బుజ్జి పైన తన ప్రేమను వలకు పోశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు