Jyothika : ఇంట్లో జ్యోతిక స్ట్రిక్ట్ రూల్… ఎంత బిజీగా ఉన్నా సూర్యతో సహా అందరూ పాటించి తీరాల్సిందే

Jyothika : స్టార్ హీరో సూర్య భార్య, హీరోయిన్ జ్యోతిక చెన్నైలోని ఇంట్లో ఫ్యామిలీకి తాను పెట్టిన ముఖ్యమైన రూల్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సూర్యతో సహా ఆ రూల్ ని పాటించాల్సిందేనట. మరి ఆ రూల్ ఏంటంటే?

ఫామిలీకి జ్యోతిక స్ట్రిక్ట్ రూల్

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక ఓవైపు సినిమాలు చేసుకుంటూనే తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటుంది అనే విషయం గురించి మాట్లాడారు. బిజీ లైఫ్ గురించి జ్యోతిక స్పందిస్తూ తాను ఇంట్లో ఓ స్ట్రిక్ట్ రూల్ పెట్టినట్టు వెల్లడించింది. మా ఇంట్లో ఒక సెట్ అమ్మాయిలు, ఒక సెట్ అబ్బాయిలు ఉంటారు. మహిళలందరూ ఒక జట్టుగా ఉంటారు. వీరిద్దరి మధ్య సూర్య ఉంటాడు. కార్తీ, సూర్య షూటింగ్‌లో బిజీ, శివకుమార్ స్పీచ్ ఇస్తూ బిజీగా ఉంటారు. అయితే మా ఇంట్లో ఒక రూల్ ఉంది. అందరూ కలిసి భోజనం రాత్రి భోజనం చేయాలనేదే ఆ రూల్. కాబట్టి ఆ సమయంలో మాత్రం కుటుంబమంతా కలిసి కూర్చుని భోజనం చేస్తాం” అంటూ ఇప్పటిదాకా తన ఫ్యామిలీకి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.

సూర్యతో ప్రేమ, పెళ్లి

వాలి సినిమాతో కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. మొదటి సినిమాలోనే తన నటనతో అభిమానులను ఆకట్టుకున్న జ్యోతిక ఆ తర్వాత ఖుషి, కాక్క కాక్క, పూవెల్లం కేతుఫర్ వంటి హిట్ చిత్రాల్లో నటించి తమిళ, తెలుగు చిత్రసీమలలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. జ్యోతిక సినిమాల్లో మంచి ఫామ్‌లో ఉండగానే సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

- Advertisement -

Shaitaan Actress Jyothika Exposes The Harsh Side Of Showbiz Reveals Not  Getting Offers In Bollywood As Her First Film Was Box Office Failure, "It's  All Formula-Based"

సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ ఫాస్ట్ గా..

పెళ్లయ్యాక కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కే టైమ్ కేటాయించింది. ఇప్పుడు పిల్లలు పెరిగి, పెద్దవాళ్ళు కావడంతో 36 ఏళ్ల వయసులో సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూగా హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్న జ్యోతిక ఇప్పుడు తమిళంతో పాటు హిందీ, మలయాళం వంటి ఇతర భాషా చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా సైతాన్ అనే హారర్ మూవీతో బిగ్గెస్ట్ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది జ్యోతిక. ఈ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటు మాధవన్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు.

ఫ్యామిలీ గురించి..

ఇక ఈ ఇంటర్వ్యూ లోనే జ్యోతిక తన ఫ్యామిలీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. నా కూతురు దియా తన తండ్రిని చాలా ప్రేమిస్తుంది. సూర్య దియాతో పాటు కొడుకు దేవ్ తో ఆప్యాయంగా ఉంటాడు. నా పిల్లలు ఇప్పటిదాకా సూర్య నేను చేసిన సినిమాలేవీ చూడలేదు. మేము విడివిడిగా నటించిన సినిమాలు చాలానే చూశాము అని చెప్పవచ్చింది.

సినిమాల్లోకి వారసుడి ఎంట్రీ

కొడుకు దేవ్ సినిమాల్లోకి రాబోతున్నాడా అని అడిగినప్పుడు అఫ్ కోర్స్ నో.. అతను చదువుతో బిజీగా ఉన్నాడని జ్యోతిక చెప్పింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు