Happy birthday Bheems : భీమ్స్ బ్లాక్ బస్టర్ లైనప్

Happy birthday Bheems : ప్రస్తుతం తెలుగు సినిమా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సంగీత దర్శకులను భీమ్స్ సిసిరోలియో ఒకరు. భీమ్స్ సిసిరోలియో 2003లో వచ్చిన ఆయుధం సినిమాలోని “ఓ రాజు కన్నుల్లో నువ్వే” అనే పాటతో సాహిత్య రచయితగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 2013లో శర్వానంద్, అల్లరి నరేష్ కలిసిన నటించిన నువ్వా నేనా అనే సినిమాకి సంగీత దర్శకుడుగా పనిచేశాడు. ఆ సినిమా తర్వాత సంగీత దర్శకుడుగా చాలా సినిమాలు చేశాడు భీమ్స్ సిసిరోలియో.

ధమాకా తో బ్రేక్

సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ భీమ్స్ సిసిరోలియోకి పేరు తెచ్చిన సినిమా అంటూ పెద్దగా రాలేదు. కొన్ని సినిమాలు బాగా ఆడినా కూడా భీమ్స్ సిసిరోలియో కి గుర్తిండి పోయే పేరు అంటూ రాలేదు. అయితే 2022లో వచ్చిన ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని పల్సర్ బైక్ సాంగ్ ఇప్పటికీ ఫేమస్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లను వసూలు చేసింది. ఇక్కడితో భీమ్స్ సిసిరోలియో పేరు మారు మోగిపోయింది. బీమ్స్ ధమాకా ఏంటో ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తెలిసి వచ్చింది.

Balagam

- Advertisement -

బలగం భీమ్స్ టాలెంట్ కి నిదర్శనం

అయితే కమర్షియల్ బ్రేక్ ధమాకా సినిమాతో వచ్చినా కూడా, బట్ స్టిల్ ఈరోజు వరకు భీమ్స్ సిసిరోలియో బెస్ట్ వర్క్ అంటే బలగం అని చెప్పొచ్చు. బలగం సినిమాలో భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు వేరే రేంజ్. దర్శకుడు వేణు రాసిన కథకి తన సంగీతంతో ప్రాణం పోసాడని చెప్పొచ్చు. భీమ్స్ మ్యూజిక్ తో ఎమోషన్ పీక్ కి వెళ్ళింది.

సాహిత్య రచయితగా కూడా

ఇకపోతే ప్రస్తుత కాలంలో భీమ్స్ సిసిరోలియో చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. రీసెంట్ గా మ్యాడ్ అనే సినిమాకి కూడా సంగీతం అందించాడు బీమ్స్. భీమ్స్ మంచి లైనప్ తో తన కెరీర్ ప్లాన్ చేసాడు. కేవలం సంగీత దర్శకుడుగానే కాకుండా సాహిత్య రచయితగా కూడా భీమ్స్ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. సింగర్ గా కూడా భీమ్స్ రాణిస్తున్నాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గుర్తుండిపోయే పాటలను మరికొన్ని అందించాలని, ఇంకా మంచి పేరు సాధించి స్టార్ హీరోలకి కూడా అద్భుతమైన మ్యూజిక్ అందించి పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లాలని కోరుకుంటూ ఫిల్మిఫై తరఫునుంచి భీమ్స్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు