N. Lingusamy: ఆ సినిమా ఆగిపోలేదు

గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మంచి కథలను ఎన్నుకుంటూ వరుసగా హిట్ సినిమాలను చేసాడు. కమర్షియల్ హీరోగానే కాకుండా కేబుల్ రాజు, గోన గన్నారెడ్డి లాంటి వైవిధ్యమైన పాత్రలను చేసి నటుడిగా మంచి గుర్తింపు సాధించాడు. అల్లు అర్జున్ తో రిపీటెడ్ గా వర్క్ చేసిన సుకుమార్ , త్రివిక్రమ్ లు కూడా మంచి హిట్స్ ఇచ్చారు.

2018 లో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా బన్ని ను, అభిమానులను కాస్తా నిరాశపరిచింది.ఆ తరవాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న బన్ని, అల వైకుంఠపురంలో సినిమాతో పెద్ద సక్సెస్ ను అందుకున్నాడు. తెలుగు స్టార్ హీరోస్ లో ఒకరిగా కొనసాగుతున్న అల్లు అర్జున్, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
పుష్ప సినిమా తీసుకొచ్చిన గుర్తింపు వర్ణనాతీతం అని చెప్పొచ్చు.
ప్రస్తుతం పుష్ప -2 పనుల్లో పడిపోయాడు అల్లు అర్జున్.

సుకుమార్ తో చెయ్యాల్సిన ఈ ప్రాజెక్ట్స్ కాకుండా బన్ని అప్పట్లోనే చాలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్, అలానే ఏ.ఆర్ మురగదాస్ దర్శకత్వంలో మరో సినిమా, అలానే లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమాను చేసి తమిళ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చే సన్నాహాలు జరిపారు ఆ రోజుల్లో. లింగుస్వామి ఇప్పుడు రామ్ తో వారియర్ సినిమాను ఫినిష్ చేసాడు. ఈ ప్రొమోషన్స్ లో భాగంగా బన్ని తో సినిమా గురించి లింగుస్వామి ను అడిగితే, ఆ సినిమా ఆగిపోలేదని, ఆ ప్రాజెక్ట్ ఎప్పటికైనా జరుగుతుందని, బన్ని తో రోజు లింగుస్వామి టచ్ లో ఉంటున్నట్లు తెలిపాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు