NTR30 : రంగంలోకి బోల్డ్ బ్యూటీ ?

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో రెండో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక వీడియోను కూడా వదిలారు. ‘ఆర్.ఆర్.ఆర్’ బ్లక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో, భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ జూలై నెలలో ప్రారంభం కావాలి. కానీ, కొరటాల శివ ‘ఆచార్య’ నష్టాలను తీర్చే బాధ్యత స్వీకరించాడు. దీంతో ఈ సినిమా డిలే అవుతూ వస్తోందని వినికిడి. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. మరోపక్క ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక కూడా మొదలుపెట్టాడట దర్శకుడు కొరటాల. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పరభాషా నటీనటులను కూడా ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడు.

ఇందులో భాగంగా, ఓ కీలక పాత్ర కోసం కన్నడ నటి రుషిక రాజ్ ను ఎంపిక చేసుకున్నాడు అని తెలుస్తుంది. రుషిక గత ఏడాది తెలుగులో ‘అశ్మీ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో రుషిక బోల్డ్ పాత్ర పోషించింది. ప్రస్తుతం కన్నడ లో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు ఎన్టీఆర్- కొరటాల మూవీకి ఈ మధ్యనే సైన్ చేసినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు