Samuthirakani : పవన్ కళ్యాణ్ వల్ల 5 కోట్లు నష్టం ?

‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ కళ్యాణ్ మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ‘హరి హర వీర మల్లు’ సెట్స్ పై ఉంది. మరొకటి హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. దీంతో పాటు సముథ్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతమ్’ రీమేక్ పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరుపుకుంది. సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా ఉంది. అయితే ఈ సినిమాలు ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. జన వాణి కార్యక్రమం, చాతుర్మాస దీక్ష లాంటి పేర్లు చెప్పి పవన్ కళ్యాణ్ షూటింగ్ లకు డుమ్మా కొట్టి తిరుగుతున్నాడు. ఇందు వల్ల సముథ్ర ఖని కోట్లు నష్టపోతున్నాడు అని వినికిడి.

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్న నటుడు సముథ్ర ఖని. పవన్ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో, నటుడిగా, విలన్ గా వస్తున్న అవకాశాలను పక్కన పెట్టాడు. పవన్ సినిమా కోసం దాదాపు ఐదు సినిమాలను సముథ్ర ఖని వదులుకున్నాడట. సాధారణంగా ఒక్కో సినిమాకు కోటి నుండి కోటిన్నర వరకు పారితోషికం తీసుకుంటాడు సముథ్ర ఖని. ఈ లెక్కన దాదాపు 5 కోట్ల నుండి 6 కోట్ల నష్టం వచ్చిందని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు