Most Viewed lyrical videos: 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన టాప్ -5 లిరికల్ వీడియోస్ ఇవే..!

Most Viewed lyrical videos..ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు మ్యూజికల్ పరంగానే బాగా హిట్ అవుతున్నాయని చెప్పవచ్చు.. ఇక అందులో భాగంగానే 24 గంటల్లోనే అత్యధికంగా వీక్షించిన లిరికల్ వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్నాయి.. మరి విడుదలైన 24 గంటల్లోనే అత్యధికంగా వీక్షించిన లిరికల్ వీడియోస్ గురించి ఇప్పుడు చూద్దాం.

గుంటూరు కారం:

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమాలో “దమ్ మసాలా” సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 17.42 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.

సర్కారు వారి పాట:

పరుశురాం డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట.. ఈ సినిమాలో ‘పెన్నీ పెన్నీ’ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 16.38 మిలియన్ వ్యూస్ సాధించగా.. ఇదే సినిమాలోని కళావతి పాట ఏకంగా 14.78 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాదు ఈ సినిమాలో వచ్చిన మరో పాట మా మా మహేషా 13.56 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా.

- Advertisement -

పుష్ప:

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన చిత్రం పుష్ప . ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో నర్థించి మెప్పించిన విషయం తెలిసిందే.. అంతేకాదు సమంత ఐటెం సాంగ్ లో నటించడం ఇదే మొదటిసారి.. ఈ పాట ఊ అంటావా ఉ ఊ అంటావా మావ పాట.. విడుదలైన 24 గంటల్లోనే 12.39 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. మొత్తానికైతే లిరికల్ వీడియోస్ అన్నీ కూడా 24 గంటల్లోనే ఇంత వ్యూస్ సాధించి ప్రేక్షకులలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. మొత్తానికైతే టాలీవుడ్ లో విడుదలైన 24 గంటల్లోనే మోస్ట్ లిరికల్ వీడియోస్ గా గుర్తింపు సంపాదించుకున్నాయి.

Most Viewed lyrical videos: These are the top 5 most viewed lyrical videos in 24 hours..!
Most Viewed lyrical videos: These are the top 5 most viewed lyrical videos in 24 hours..!

ఇక వీటితోపాటు విడుదలైన 24 గంటల్లోనే టాలీవుడ్ టాప్ -5 మోస్ట్ లైక్డ్ లిరికల్ వీడియోస్ గురించి ఇప్పుడు చూద్దాం..

సర్కారు వారి పాట..
పరశురాం , మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా సర్కారు వారి పాట.ఈ సినిమాలో కళావతి సాంగ్ ఏకంగా 806.3 K లైకులు సొంతం చేసుకుంది.

భీమ్లా నాయక్..

పవన్ కళ్యాణ్ హీరోగా, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన చిత్రం భీమ్లా నాయక్.. ఈ సినిమాలో భీమ్లా నాయక్ పాట 805.5 K లైక్ లను లిరికల్ సాంగ్ సొంతం చేసుకోగా.. ఇదే సినిమాలోని లాలా భీమ్లా పాట 658.3 K లైక్స్ సొంతం చేసుకుంది.

పుష్ప:

సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప.. ఈ సినిమా టైటిల్ సాంగ్ దాక్కో దాక్కో మేక లిరికల్ సాంగ్ 657 K లైక్స్ సొంతం చేసుకోగా.. ఇదే సినిమాకు సంబంధించి ఉ అంటావా పాట 634.1K లైక్స్ సొంతం చేసుకుంది..

ఇవన్నీ కూడా విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న పాటలలో టాప్ 5 జాబితాలో నిలిచాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు