Nandamuri Balakrishna: సత్యభామ కోసం నటసింహం

Nandamuri Balakrishna: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. అతి తక్కువ టైంలోనే చాలామంది హీరోలతో సినిమాలు చేసి తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకుంది. కాజల్ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా బెస్ట్ ఫిలిం అని మాట్లాడాల్సి వస్తే మగధీర అని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత కాజల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్ హీరోలు పక్కన కూడా నటించింది.

కెరీర్ పీక్ లో ఉన్న టైంలో పెళ్ళి

అయితే కెరీర్ పీక్ లో ఉన్న టైంలో గౌతమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది కాజల్. ఆ తర్వాత మళ్లీ సినిమా రంగాన్ని వదలకూడదు అని చెప్పి అభిమానులను దూరం చేసుకోకూడదని ఉద్దేశంతో మళ్లీ సత్యభామ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే సినిమాపై అంచనాలను కూడా ఈ టీజర్ క్రియేట్ చేసింది.

Nandamuri Balakrishna

- Advertisement -

సత్యభామ తో రీ ఎంట్రీ

ఈ సినిమాను శశికిరణ్ తిక్క ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సుమన్ చిక్కాలా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను 24వ తారీఖున పెట్టనున్నారు. అయితే దీనికి నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి అనే సినిమాను చేసారు. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది కాజల్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు