Mission Ranigunj: మరో బయోపిక్ తో బాలీవుడ్ రెడీ.. బాలయ్య ఎప్పుడో తీసాడుగా?

Mission Ranigunj:

బాలీవుడ్ మళ్ళీ పాత జోన్ లోకి వచ్చేస్తుంది. బయోపిక్ ల పర్వం ఊపందుకుంటుంది. కొన్నేళ్ల కిందటి వరకు బాలీవుడ్ లో బయోపిక్ సినిమాలదే హవా. అక్కడ ఏ పెద్ద హీరో సినిమా చేసినా ఎప్పుడో ఒకప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడం, లేదంటే వ్యక్తుల జీవిత కథ ఆధారంగా సినిమాలు తీయడం జరుగుతూ ఉంది. ఈ మధ్య సౌత్ సినిమాల ఎఫెక్ట్ వలన తగ్గించినా, మళ్ళీ బయోపిక్ సినిమాలు తీయడం స్టార్ట్ చేసేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్.

తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా “మిషన్ రాణిగంజ్”. పశ్చిమ్ బెంగాల్ లో బర్ధమాన్ జిల్లాలో ఉన్న అసన్‌సోల్, దుర్గాపూర్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న బొగ్గుగనుల నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

1989 లో అక్కడ బొగ్గు గనుల్లో జరిగిన ఘోర ప్రమాదంలో 6 మంది మైనింగ్ కార్మికులు చనిపోయారు. ఇక అందులో నుండి 220 మంది విధుల్లో ఉండగా, ప్రమాదం గురించి తెలియగానే 149 మంది బయటికొచ్చేసారు. మరి 64మందిని రెస్క్యూ టీమ్ కాపాడారు. అప్పటివరకు దేశంలో జరిగిన అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ గా దీన్ని చెప్పడం జరిగింది. ఈ ప్రమాద నేపథ్యంలోనే మిషన్ రాణిగంజ్ తెరకెక్కింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అక్షయ్ కుమార్ రెస్క్యూ టీమ్ ఆపరేషన్ హెడ్ గా, ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ గా నటించాడు. మిషన్ రాణిగంజ్ సినిమాను టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించాడు. ఇక ‘మిషన్ రాణిగంజ్’ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ అవుతుంది.

- Advertisement -

 

 

 

అయితే తెలుగులో 30ఏళ్ళ కిందటే బాలకృష్ణ హీరోగా బొగ్గుగనుల నేపథ్యంలో సినిమా వచ్చింది. అదే నిప్పురవ్వ. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, శత్రుఘ్న సిన్హా హీరోలుగా నటించిన ‘కాలా పత్తర్’ సినిమాను తెలుగు వెర్షన్ కి అనుకూలంగా, మిషన్ రాణిగంజ్ ప్రమాద సంఘటనని సింగరేణికి బొగ్గు గనుల కథగా మార్చి తీయడం జరిగింది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన నిప్పురవ్వ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు