‘ఆచార్య’ టెన్ష‌న్ లో మెగా ఫ్యాన్స్..!

సినిమాకు ప్ర‌మోష‌న్స్ చాలా కీల‌కం. సినిమా బ‌డ్జెట్ లో దీనికి ప్ర‌త్యేక స్థానాన్ని కూడా కేటాయిస్తారు. షూటింగ్ పూర్తి అయిన నాటి నుంచి డైరెక్ట‌ర్స్, హీరో, హీరోయిన్స్ ప్ర‌మోష‌న్స్ హ‌డావుడిలోనే ఉంటారు. టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌క్క‌న్న అయితే.. దీని కోసం ప్ర‌త్యేక షెడ్యూల్ ను కూడా కేటాయిస్తాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ఏడు రోజుల్లో తొమ్మిది న‌గ‌రాల‌ను చూట్టేశారు. అలాగే వ‌రుస ఇంట‌ర్వ్యూల‌నూ ఇచ్చారు. దీని వ‌ల్ల ఆర్ఆర్ఆర్ సినిమాకు కావాల్స‌న హైప్ క్రియేట్ అయింది. నిజానికి అన్ని సినిమాల‌కు మ‌రీ ఆర్ఆర్ఆర్ అంత కాక‌పోయినా… కాస్త గ‌ట్టిగానే ప్ర‌మోష‌న్స్ చేశారు. అయితే ఆచార్య సినిమా విష‌యానికి వ‌స్తే.. ఇది క‌నిపించ‌డం లేదు.

సినిమా విడుద‌లకు ఇంకా వారం రోజులే స‌మ‌యం ఉన్నా.. ఆ వేడి క‌నిపించ‌డం లేదు. సినిమాకు కావాల్సిన బ‌జ్ రాలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే ఒక్క ఇంట‌ర్వ్యూలో రామ్ చ‌ర‌ణ్, కొరటాల శివ క‌నిపించారు. ఇక మెగా స్టార్ ప్ర‌మోష‌న్స్ మాట‌నే తీయ‌డం లేదు. అలాగే ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ను క‌ట్టిప‌డేసే పోస్ట‌ర్స్ కూడా రిలీజ్ అవ‌డం లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ టెన్ష‌న్ లో ఉన్నారు. మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న మూవీ ఎలాంటి ఫ‌లితాలను ఇస్తుందో అని హైరానా ప‌డుతున్నారు. కాగ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైల‌ర్ ఫ్యాన్స్ అసంతృప్తి ప‌రిచింది. మ‌ణిశ‌ర్మ మ్యాజిక్ కూడా వ‌ర్కౌట్ కాలేద‌ని సినీ క్రిటిక్స్ అంటున్నారు. 23వ తేదీన జ‌రిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ త‌ర్వాత అయినా.. చిత్ర బృందం మైన‌స్ ల‌ను పూడ్చి.. ప్ర‌మోష‌న్స్ పై దృష్టి పెడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు