Maruthi : “నా స్టైల్ లో చేస్తా”

ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుంది. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, మారుతి, ప్రభాస్ పరోక్షంగా క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా మారుతి మరోసారి ఈ సినిమాపై స్పందించాడు.
‘ప్రభాస్ తో సినిమా చేయాల్సి ఉంది. ఎలా చూపించాలి అనే విషయంలో నాకు ఓ ఐడియా ఉంది. అలాగే చూపిస్తాను. నేను నాటుకోడి బాగా వండుతాను అనుకుంటే అది మాత్రమే నేను వండగలను. అంతేకానీ చైనీస్ వంటలు నేను వండలేను’ అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడు మారుతి.

అలాగే ఈ మూవీలో హీరోయిన్లు ఎవరు అనే ప్రస్తావన రాగా, ‘ఇంకా హీరోయిన్లు ఎవరనే అంశంపై డిస్కషన్లు జరగలేదు. ఇంకా మేటర్ అక్కడి వరకు వెళ్లలేదు. ప్రభాస్ తో ఇంకా స్టోరీ డిస్కషన్స్ జరపాల్సి ఉంది. స్క్రిప్ట్ పక్కాగా లాక్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి’ అంటూ మారుతి చెప్పుకొచ్చాడు.
ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ విషయం అక్కడి వరకు వెళ్లకుండా, ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవ్వకుండా సంగీత దర్శకుడిగా తమన్ ఎంపికచేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు