Mahesh Babu: హిట్ కొట్టాల్సిందే

కొన్ని కాంబినేషన్స్ కి ఉండే క్రేజే వేరు. రాజమౌళి తారక్ కాంబినేషన్, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్. వాస్తవానికి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ టెలివిజన్ లో మాత్రం ఆ సినిమాలకు ఇప్పటికి అద్భుతమైన ఆదరణ దక్కుతుంది.

త్రివిక్రమ్ మహేష్ తో చేసిన రెండు సినిమాల్లోను మహేష్ ను రెండు విభిన్న పాత్రలో చూపించాడు. అతడు సినిమాలో సైలెన్స్ మహేష్ బాబు ను చూపించి, ఖలేజా సినిమాతో మహేష్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. ఖలేజా లోని మహేష్ కామెడీ టైమింగ్ ఇప్పటికి ఒక ఫ్రెష్ ఫీల్ ను క్రియేట్ చేస్తుంది.

త్రివిక్రమ్ గత సినిమాలు అరవిందసమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ చెయ్యబోయే SSMB28 కూడా కమర్షియల్ హిట్ అయితేనే ఈ ప్రాజెక్ట్ కు న్యాయం జరిగినట్లు అనేది చాలామంది అభిప్రాయం. ఎందుకంటే వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆ గత సినిమాలు కొంత నిరాశపరిచినవే. అందుకు ఈ సినిమా విజయం సాధించడం కీలకం. SSMB28 షూటింగ్ జులై చివరి వారంలో కానీ ఆగష్టు మొదటివారంలో కానీ ప్రారంభం కానుంది. 2023 వేసవిలో ఈ సినిమా విడుదలను ప్లాన్ చేస్తునట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు