PellisandaD : థియేటర్స్ లో హిట్, ఓటీటీలో ఫట్ ?

ఓ సినిమా ప్లాప్ అయ్యింది అంటే బోలెడన్ని కారణాలు ఉంటాయి. అలాగే ఓ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి.
సక్సెస్ అయిన సినిమాకు రిలీజ్ డేట్ కలిసి రావచ్చు. పండుగ సెలవులు ఉండచ్చు. సరిగ్గా ఇలాగే శ్రీకాంత్ కొడుకు రోషన్ సినిమాకు జరిగింది. రోషన్, శ్రీ లీల హీరో హీరోయిన్ గా ‘పెళ్ళిసందD’ అనే సినిమా వచ్చింది. గతేడాది అక్టోబర్ 15న దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం లో రూపొందిన పాటలు రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అయ్యాయి. దసరా పండుగ సెలవులు కలిసొచ్చాయి. పాత ‘పెళ్ళి సందడి’ సినిమా క్రేజ్ ఉంది. కాబట్టి సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్లు బాగా నమోదయ్యాయి. మాస్ ఏరియాల్లో ఏకంగా 50 రోజులు నడించిది ఈ సినిమా.

అయితే చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ ఇటీవల ‘జీ5’ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఈ మూవీని చూసి ‘ఈ మూవీ ఎలా హిట్ అయ్యిందిరా బాబు’ అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘కలెక్షన్స్ వచ్చినంత మాత్రాన సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటే ఎలా’ అంటూ మరికొంతమంది నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు