అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థాంక్యూ’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కాగా ఇప్పటి వరకు విడుదలైన టీజర్ తో పాటు ‘మారో’, ‘ఏంటో ఏంటేంటో..’ వంటి పాటలు మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ చిత్రం నుండి ‘ఫేర్ వెల్’ అనే పాటను కూడా విడుదల చేశారు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమక్షంలో ఈ పాటను విడుదల చేసి తమ సినిమాకు హైప్ పెంచుకునే ప్రయత్నం చేసింది ‘థాంక్యూ’ చిత్ర బృందం.
ఇక ‘ఫేర్ వెల్’ పాట విషయానికి వస్తే సంగీత దర్శకుడు తమన్ అందించిన ట్యూన్ మొత్తం మిక్కీ జె మేయర్ స్టైల్ ను ఫాలో అయిన ఫీలింగ్ ను కలిగిస్తుంది. ‘హ్యాపీ డేస్’ ‘కొత్త బంగారు లోకం’ ‘కేరింత’ లాంటి యూత్ ఫుల్ చిత్రాలకు మిక్కీ జె మేయర్ ఇలాంటి బాణీలు సమకూర్చాడు. తమన్ యాజ్ ఇట్ ఈజ్ గా మిక్కీ స్టైల్ ను దించడం విశేషం. అయితే చంద్రబోస్ అందించిన లిరిక్స్, అర్మాన్ మాలిక్ పాడిన విధానం పాటని నిలబెట్టాయి అని చెప్పవచ్చు. ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి తమ కాలేజ్ డేస్ గుర్తుకొస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.