Malli Pelli : టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ !

టాలీవుడ్ లో ప్రస్తుతం మళ్ళీ పెళ్లి ట్రెండ్ నడుస్తుంది. రెండు పెళ్లిలు, మూడు పెళ్లిల సంసృతి టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉండగా, నరేష్ పవిత్రల పెళ్లితో ఈ ట్రెండ్ కి మళ్ళీ ఊపు వచ్చింది.

యాక్టర్ నరేష్ టాలీవుడ్ లో ఎంత పేరున్న నటుడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ, రెండో భార్య విజయ నిర్మల కొడుకైనప్పటికీ, కృష్ణ వారసుడిగానే నరేష్ టాలీవుడ్ కి అరంగ్రేటం చేసారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన ఆయన సినీ ప్రయాణం టాలీవుడ్ లో స్టార్ యాక్టర్ వరకు కొనసాగింది. అయితే ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పోసిషన్ లో కొనసాగుతున్నారు.

అయితే నరేష్ కి ఆయన చేసిన సినిమాల ద్వారా వచ్చిన పేరు కంటే కూడా ఆయన నాలుగో పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్త జనాల్లో చర్చనీయా అంశంగా మారింది. దాంతో పాటు ఆయన ఈ వయసులో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అనే కాన్సెప్ట్ పై ఆయన ప్రొడ్యూసింగ్ చేస్తూ మళ్ళీ పెళ్లి అనే సినిమా కూడా తీశారు. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. అయితే ఈ యాభై, అరవై ఏళ్ళ వయసు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది టాలీవుడ్ లో కొత్తేమి కాదు. గతంలో కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు, అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ కూడా ఇలాగె లేటు వయసు రెండో పెళ్లిళ్లు చేసుకున్నారు.

- Advertisement -

లేటెస్ట్ గా మరో 60 ఏళ్ళ యుక్త వయసు టాలీవుడ్ యాక్టర్ కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అతనెవరో కాదు ఆశిష్ విద్యార్ధి. పలు తెలుగు, తమిళ్, హిందీ భాషలలో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆశిష్ విద్యార్ధి, రూపాలి బరువ అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. కోల్ కతా లోని ప్రముఖ హాల్ లో బందువుల, సన్నిహితుల మధ్యలో ఈ వివాహం జరిగింది .దీన్నిబట్టి చూస్తే టాలీవుడ్ లో మళ్ళీ పెళ్లి ల ట్రెండ్ స్టార్ అయినట్టే ఉంది. అయితే ఇది ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు