Mytri: భార్యాభర్తలను టాలీవుడ్ కు తెచ్చిన ‘మైత్రి’

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ‘మైత్రి మూవీ మేకర్స్’ కూడా ఒకటి. ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ సంస్థ. తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్లో కూడా సినిమాలు నిర్మించడానికి  ప్లాన్ రెడీ చేస్తుంది. చిరంజీవి,పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్, సల్మాన్ ఖాన్, విజయ్ దేవరకొండ.. వంటి స్టార్ హీరోలంతా ఈ బ్యానర్లో సినిమాలు చేయబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఎవ్వరికీ సాధ్యం కానీ ఓ ఘనతని ఈ సంస్థ దక్కించుకుంది.

మలయాళంలో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ఫహాద్ ఫాజిల్, నజ్రియా వంటి నటీనటులను టాలీవుడ్ కు పట్టుకొచ్చింది ఈ సంస్థే. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు ఫహాద్ ఫాజిల్. ఈయన నటన ఆ మూవీలో ఓ రేంజ్లో ఉంటుంది. ‘పుష్ప 2’ లో ఈయన పాత్ర ఇంకా భీభత్సంగా ఉంటుంది అని వినికిడి. ఇక ‘అంటే సుందరానికీ!’ చిత్రంతో ఫహాద్ ఫాజిల్ భార్య అయిన నజ్రియాని కూడా టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీలో ఆమె నటన ఎంత చక్కగా నటించిందో చూశారుగా. నిజానికి ఈ భార్యాభర్తలని టాలీవుడ్ కు పరిచయం చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ట్రై చేశారు. కానీ ఫైనల్ గా అది ‘మైత్రి’ వారికే సాధ్యమైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు