దగ్గుబాటి రానా హీరోగా,సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. 2019లో మొదలైన ఈ చిత్రం షూటింగ్ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఓ దశలో ఓటీటీకి వెళ్తుంది అనే టాక్ వచ్చినా చివరికి మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపారు. జూన్ 17న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రావన్న పాత్రలో, సాయి పల్లవి వెన్నెల పాత్రలో కనిపించబోతున్నారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.
రానా, సాయి పల్లవి.. ఈ చిత్రాన్ని గ్యాప్ లేకుండా ప్రమోట్ చేస్తున్నారు. ఇక నిర్మాతలు అయిన సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి అయితే టాలీవుడ్లో ఉన్న కొంతమంది సినీ ప్రముఖులకు స్పెషల్ షో లు వేయడం జరిగింది. అవి చూసిన వారు సూపర్, అదరహో అంటూ ప్రశంసించారు. ఇక విరాటపర్వం ప్రీ రిలీజ్ వేడుకని జూన్ 15వ తారీఖున నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిధులుగా విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ హాజరు కానున్నారు.