మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ ఆచార్య మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తొలి రోజు నుంచి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మెగా స్టార్ ను సిల్వర్ స్క్రిన్ పై చూడటానికి ఆశగా ఎదురుచూసిని మెగా ఫ్యాన్స్ కు బెంగపాటే మిగిలింది. కొరటాల శివ దర్శకత్వంపై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలుతున్నాయి.
ఇప్పటికే మూవీ ప్లాప్ టాక్ తో నిరాశలో ఉన్న మూవీ యూనిట్ కు కలెక్షన్ల రూపంలో మరో షాక్ తగలింది. ఆచార్య ఫస్ట్ డే రూ. 29.59 కోట్ల కలెక్షన్స్ మాత్రమే చేసింది. నైజంలో రూ. 7.99 కోట్లు, సీడెడ్ రూ. 4.60 కోట్లు, ఉత్తరాంద్ర లో రూ. 3.61 కోట్లు, గుంటూర్ లో రూ. 3.76 కోట్లు, వెస్ట్ రూ. 2.90 కోట్లు, ఈస్ట్ లో రూ. 2.53 కోట్లు నెల్లూరు లో రూ. 2.30 కోట్లు, కృష్ణా రూ. 1.90 కోట్లు తెచ్చుకుంది.
టాలీవుడ్ లీడర్ గా పేరు తెచ్చుకున్న మెగా స్టార్ చిరంజీవి మూవీకి ఇలాంటి ఓపెనింగ్స్ రావడం మెగా ఫ్యాన్స్ మింగుడు పడటం లేదు. చిరంజీవి పాలిటిక్స్ నుంచి టాలీవుడ్ కు కమ్ బ్యాక్ వచ్చిన తర్వాత ఒక మూవీకి ఫస్ట్ డే ఇలాంటి కలెక్షన్స్ రాలేదు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహరెడ్డి సినిమాలకు ఫస్ట్ డే రూ. 50.45 కోట్లు, రూ. 62 కోట్లు సాధించి అప్పట్లో రికార్డులు సృష్టించాయి.
కాని రూ. 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆచార్య మూవీకి కనీసం బ్రేక్ ఈవెన్ కూడా రావడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం.. కొరటాల శివనే అని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.