బుట్ట‌బోమ్మ స్టార్ హీరోయినే.. కానీ..!

టాలీవుడ్ బుట్ట‌బోమ్మ పూజా హెగ్డే కు ఎంత క్రేజ్ ఉందో అంద‌రికీ తెలుసు. త‌న హ‌వాభావాల‌తో త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ స్టార్ డ‌మ్ ను సాధించుకున్న ఈ భామ‌కు ఐరెన్ లెగ్ ట్యాగ్ వేంటాడుతుంది.. వేధిస్తుంది. పూజా చేసిన సినిమాలు అన్నీ కూడా ప్లాప్ కావ‌డంతో సోష‌ల్ మీడియాలో.. ఐరెన్ లెగ్ అంటూ విప‌రీతంగా ట్రోల్స్ వ‌స్తున్నాయి.

పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్, రాధేశ్యామ్, బీస్ట్ సినిమాలు వ‌రుస‌గా ప్లాప్ టాక్ ను తెచ్చుకున్నాయి. దీంతో పూజా ఐరెన్ లెగ్ అంటూ ప్ర‌భాస్, విజ‌య్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ఫైర్ అయ్యారు. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న స‌మ‌యంలో ఆచార్య మూవీ రిలీజ్ అయింది.

మెగా స్టార్ ఆచార్య మూవీలో పూజా హెగ్డే గెస్ట్ రోల్ లో క‌నిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కూడా ఫ‌స్ట్ డే నుంచే.. నెగెటివ్ టాక్ తెచ్చుకుంటుంది. దీంతో మెగా ఫ్యాన్స్.. పూజా పై విరుచుకుప‌డుతున్నారు. ఈ ఐరెన్ లెగ్ ఫుల్ లెన్త్.. గెస్ట్ రోల్స్ అంటూ తేడా లేదు.. అడుగు పెడితే.. అట్ట‌ర్ ప్లాపే అంటూ ఫైర్ అవుతున్నారు. బుట్ట‌బోమ్మ‌పై మ‌రోసారి ఈ ట్యాగ్ ప‌డ‌టంతో అవ‌కాశాలు కూడా త‌గ్గుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు