బాలకృష్ణ : “అన్న‌గారు” వ‌స్తున్నార‌హో…!

అఖండ‌తో నంద‌మూరి బాల‌కృష్ణ సాలిడ్ హిట్ అందుకున్నాడు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత‌.. వంద కోట్ల సాధించిన కొద్ది సినిమాల లీస్ట్ లో అఖండ కూడా చేరిపోయింది. ఈ సినిమా త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్న బాల‌కృష్ణ‌.. ప్ర‌స్తుతం గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.

అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. బాల‌య్య 107 సినిమా కోసం డైరెక్ట‌ర్ గోపీచంద్ మాలినేనీ.. “అన్న‌గారు” అనే టైటిల్ ను ఖ‌రారు చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్. అయితే అన్న‌గారు.. అని ఎన్టీ రామా రావు ను అభిమానులు పిలిచే వారు. ఆయ‌న మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా… అన్న గారు అనే ప‌దాన్ని నంద‌మూరి ఫ్యాన్స్ ఇప్ప‌టికీ వాడుతున్నారు.

అయితే ఇప్పుడు అదే ప‌దాన్ని బాల‌య్య మూవీకి ఉండ‌బోతుంద‌ని తెలిసి.. నంద‌మూరి ఫ్యాన్స్ ఫుల్ ఖూషి అవుతున్నారు. ఈ మూవీలో బాల‌య్య మాస్ లుక్స్ కి ఈ టైటిల్ కు స‌రిగ్గా సెట్ అవుతుంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఈ టైటిల్ పై చిత్ర బృందం ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే అతి త్వ‌ర‌లోనే అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు