శ్రీ‌విష్ణు, విశ్వ‌క్‌తో సుమ‌క్క‌ “పంచాయితీ”

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం పెద్ద సినిమాలో పోటీ న‌డుస్తుంది. మొన్నటి వ‌ర‌కు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 మ‌ధ్య, ఇప్పుడు ఆచార్య, కేజీఎఫ్ – 2తో పోటీ న‌డుస్తుంది. ప్రేక్ష‌కుల‌కు పెద్ద సినిమాలు మాస్ ఎంట‌ర్‌టైన్ ఇవ్వ‌గా.. మ‌రి కొద్ది రోజుల్లో చిన్న సినిమాలు క్లాస్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాయి. మే 6వ తేదీన ఏకంగా మూడు చిన్న సినిమాలు బాక్సాఫీస్ పై దండయాత్ర చేయ‌నున్నాయి.

బుల్లితెర యాంక‌ర్ సుమ క‌న‌కాల జ‌య‌మ్మ పంచాయితీ మే 6 రోజే ముహుర్తం ఖ‌రారు చేసుకున్న విష‌యం తెలిసిందే. జ‌య‌మ్మ తో పాటు యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం జ‌ర‌ప‌డానికి ఆ చిత్ర బృందం ఇప్ప‌టికే ఫిక్స్ అయిపోయింది.

జ‌య‌మ్మ‌, విశ్వ‌క్ సేన్ పంచాయితీలోకి తాజా గా యంగ్ హీరో శ్రీ‌విష్ణు కూడా చేరాడు. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న భళా తందనాన కూడా మే 6 రోజే విడుద‌ల చేస్తున్న‌ట్టు ఆఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద సినిమాలతో మాస్ మూడ్ కు వెళ్లిన సినీ ల‌వ‌ర్స్ ఈ మూడు చిన్న మూవీస్ ను ఎంత వ‌ర‌కు ఆద‌రిస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు