Liger: డిమాండా అటెన్షనా ?

అతి తక్కువ టైం లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి ,గీతగోవిందం, టాక్సీవాలా లాంటి హిట్ సినిమాలు తరువాత డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు వరుసగా దెబ్బ కొట్టాయి. కానీ ఇప్పటికి విజయ్ సినిమా పై ప్రేక్షకులకి మంచి అంచనాలు ఉన్నాయ్.

ప్రస్తుతం విజయ్ పాన్ ఇండియా చిత్రం లైగర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. లైగర్ లో ఒక కీలక పాత్రలో “మైక్ టైసన్” కనిపించనున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మొదటిసారిగా MMA ఫైటర్‌గా కనిపించనున్నారు. కేవలం “లైగర్” కోసం చాలా వర్కౌట్స్ చేసి ఫిట్ గా తయారయ్యాడు విజయ్.

నేడు లైగర్ సినిమా నుండి ఒక ఫోటో రిలీజ్ చేసింది మూవీ టీం.
విజయ్ గురించి చెబుతూ ఈ సినిమా మీకు చాలా కాలం గుర్తుంటుంది అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ఈ ఫోటో లో విజయ్ బట్టలు లేకుండా రోజా పూలతో ఉన్న బొకెను కప్పుకుని కనిపించాడు.

- Advertisement -

కథ డిమాండ్ చేస్తే పరవాలేదు కానీ, ప్రేక్షకుల అటెన్షన్ కోసమే ఇలా పిక్స్ రిలీజ్ చేస్తే, సినిమా రిలీజ్ తరువాత ఖచ్చితంగా ట్రోల్ కి గురవుతారు అనేది చాలామంది అభిప్రాయం. విజయ్ కి జంటగా అనన్య పాండే ఈ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ టీం ప్రమోషన్స్‌ని ప్లాన్ చేసే ఆలోచనలో ఉంది. లైగర్ ఆగస్టు 25న విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు