2008 లో రవితేజ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం నేనింతే. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సియా గౌతమ్. ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో సియాకు పెద్దగా అవకాశాలు రాలేదు. వేదం చిత్రంలో నటించింది. కానీ, అందులో పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. తర్వాత బాలీవుడ్ బాట పట్టి, సంజు సినిమాలో నటించింది. అందులో కూడా పెద్దగా ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాదు. చివరిగా సియా గౌతమ్ తెలుగులో 7ప్రేమ కథలు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని పక్కా కమర్షియల్ చిత్రంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషించింది. సియా లుక్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. ఇక నుండి తెలుగులో బిజీ అవ్వాలని భావిస్తుంది. పక్కా కమర్షియల్ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయితే అది సాధ్య పడుతుంది. ప్రస్తుతం సియా పలు వెబ్ సిరీస్ లలో, చిన్న సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. మరి ఈ రీ ఎంట్రీతో కెరీర్ ఎలా కొనసాగుతుందో చూడాలి.