Rana Daggubati : ఆలోచన మారిందా?

ఈ మధ్యనే విరాట పర్వం ప్రీ రిలీజ్ వేడుకలో రానా ‘ నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు. నా కెరీర్ లో ఇదే ఆఖరి ప్రయోగాత్మక చిత్రం. ఇక నుండి పిచ్చెక్కిద్దాం‘ అంటూ చెప్పుకొచ్చాడు. రానా కమర్షియల్ సినిమాల్లో నటించాలని రామానాయుడు నుండి సురేష్ బాబు చాలా ఒత్తిడి పెట్టారు. కానీ, రానా మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఆరు పాటలు, ఆరు ఫైట్ లు మాత్రమే ఉండే సినిమాలు చేయను అని చాలా సందర్భాల్లో చెప్పాడు రానా. అలాంటి వాడు ఒక్క సారిగా ఇదే ఆఖరి ప్రయోగాత్మక చిత్రం అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు.

దీనికి కారణం రానా భార్య మిహీకా బజాజ్ అని ఇండస్ట్రీ టాక్. పక్క హీరోలు అంతా దూసుకుపోతుంటే రానా ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. మార్కెట్ పై దృష్టి పెట్టడం లేదు. దీంతో రానా భార్య మిహీకా బజాజ్ క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ‘కొబ్బరికాయకు లొంగని దేవుడు.. మొట్టికాయకు లొంగినట్టు’ అన్నట్టు అంతమంది చెబితే మారని రానా, తన భార్య మిహీక వల్ల మారాడన్న మాట.
ఇదిలా ఉండగా, రానా ప్రస్తుతం షారుఖ్ ఖాన్ – అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జవాన్ చిత్రంలో కీలక పాత్ర చేయడానికి రెడీ అయినట్టు టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు