Koratala Siva: ఇది యాపారం, ఆచార్య నేర్పిన గుణపాఠం

Koratala Siva: కొరటాల శివ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రచయితగా కెరియర్ను మొదలుపెట్టి రచయితగా ఉన్నప్పుడే చాలా సూపర్ హిట్ సినిమాలకు రాసారు. రచయితగానే మంచి పేరును కూడా సంపాదించుకున్నారు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాను చేయాలని మొదట్లో ప్రయత్నం చేశాడు బండ్ల గణేష్. కానీ ఆ సినిమా ఎందుకో పట్టాలెక్కలేదు. ఆ సినిమా అలానే ఆగిపోయింది. ఆ తర్వాత మిర్చి సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శివ.

మొదటి సినిమానే బ్రేక్ ఇచ్చింది

చాలామంది రచయితలు దర్శకులు అవుతున్న తరుణంలో అందరూ సక్సెస్ అవుతారు అని చెప్పలేము. రైటర్ గా సక్సెస్ సాధించి డైరెక్టర్గా సక్సెస్ సాధించటం అనేది కొంతమందికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఈ జనరేషన్లో అలా వర్క్ అవుట్ అయింది త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లకు అని పేరు అని చెప్పొచ్చు. ఇక మొదటి సినిమా మిర్చితోనే దర్శకుడిగా తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు శివకు వచ్చాయి.

వరుస హిట్ సినిమాలు

మిర్చి సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా చేసిన శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసి కోట్లు కొల్లగొట్టింది. బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్ కలెక్షన్స్ ను వసూలు చేసింది శ్రీమంతుడు సినిమా. ఈ సినిమాతోనే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్ అనే సినిమా కూడా అద్భుతమైన హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ కెరియర్లు ఇదొక బెస్ట్ ఫిలిం అని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత మళ్లీ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాను చేశాడు శివ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలను రాబట్టింది.

- Advertisement -

Koratala Siva

ఆచార్యతో ఉన్నదంతా పోయింది

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది ఆశ పడుతుంటారు. కానీ ఆ అవకాశం మాత్రం చాలా తక్కువ మందికి దక్కుతుంది. ఆ తక్కువ మందిలో కొరటాల శివ ఒకరు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దాదాపు మినిమం అమౌంట్ కూడా ఆ సినిమాకు రాలేదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి కొరటాల శివ రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని వార్తలు వినిపించాయి. అయితే ఈ లాభాల్లో వాటా తీసుకుందాం అనుకున్నారు. కానీ సినిమా లాభాలు రాకపోగా తీవ్రమైన నష్టాలను మిగిల్చింది.

కృష్ణమ్మతో కమర్షియల్ అయ్యారు

సత్యదేవ్ హీరోగా రీసెంట్ గా కృష్ణమ్మ. అనే సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి ప్రజెంట్ గా కొరటాల శివ పేరును వేసారు. కొరటాల శివ పేరుని వాడుకున్నందుకు డబ్బులు కూడా ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా ఫలితం చూస్తే నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ అయిపోయింది అంటూ పోస్టర్లు వేశారు. కానీ సరిగ్గా వారం రోజుల్లోనే ఓటీటీ లో దర్శనం ఇచ్చింది ఆ సినిమా. ఇకపోతే ఈ సినిమా మిగిల్చిన నష్టాలతో శివకు సంబంధం లేదని తెలుస్తుంది. మొత్తానికి ఆచార్యతో గుణపాఠం నేర్చుకున్నారు శివ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు