RGV: విజయ్ సేతుపతి పై రాంగోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్

RGV: రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు సంచలనాత్మకమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించాడు. తన దర్శకత్వ ప్రతిభతో చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసాడు. తెలుగు సినిమాలో ఒక కొత్త మార్పును తీసుకొచ్చాడు. మెల్లగా సాగుతున్న తెలుగు సినిమాని పరుగులు పెట్టించాడు. ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో అచీవ్మెంట్స్ ను రాంగోపాల్ వర్మ జీవితంలో సాధించాడు అని చెప్పొచ్చు.

చాలామంది డైరెక్టర్లను ఇచ్చాడు

రాంగోపాల్ వర్మ శివ సినిమాను తీసినప్పుడు చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటికే కొన్ని కథలను రాసుకున్న చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆ కథలను చింపేసారు. అంత గొప్పగా శివ సినిమాను తెరకెక్కించాడు రాము. అయితే ఆ తర్వాత గాయం, సత్య వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా అందించాడు. ఇప్పుడు టాప్ డైరెక్టర్ గా చలామణి అవుతున్న చాలామంది డైరెక్టర్స్ ఒకప్పుడు రాంగోపాల్ వర్మ దగ్గర పనిచేసిన వాళ్లే.

క్రియేటివిటీకి పని చెప్పడం మానేసాడు

రాంగోపాల్ వర్మ అంటేనే క్రియేటివిటీ. చాలా తక్కువ ఏజ్ లోని వరల్డ్ సినిమాను చూడటం. ఎక్కువ పుస్తకాలు చదవడం వలన రామ్ గోపాల్ వర్మ ఆలోచన తీరు భిన్నంగా ఉంటుంది. అందుకనే రాంగోపాల్ వర్మ సినిమాలు కూడా ఒకప్పుడు చాలా భిన్నంగా ఉండేవి. రీసెంట్ టైమ్స్ లో రాంగోపాల్ వర్మ తన క్రియేటివిటీ పని చెప్పడం మానేసాడు. బయోపిక్ సినిమాలు తీస్తూ తనకు నచ్చిన పని నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ తీరు రాంగోపాల్ వర్మ కి ఇప్పుడు వచ్చింది కాదు ఇప్పటినుంచి ఉన్నదే.

- Advertisement -

Vijay Sethupathi

విజయ్ సేతుపతితో సినిమా ప్లానింగ్

విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్లో విజయ్ సేతుపతికి ఎంత పెద్ద క్రేజ్ ఉందో మనకు తెలియంది కాదు. విజయ్ చేసిన ఎన్నో సినిమాలు అక్కడ మంచి హిట్ అయ్యాయి. ఆ సినిమాలను తమిళ్ అర్థం కాకపోయినా కూడా నేర్చుకుని మరీ చూసిన తెలుగు ఆడియన్స్ ఉన్నారు. ఇక రీసెంట్ గా తెలుగులో కూడా మంచి పేరును సాధించుకున్నాడు విజయ్ సేతుపతి. రీసెంట్ గా రాంగోపాల్ వర్మ విజయ్ సేతుపతిని కలిశారు. చాలాసార్లు స్క్రీన్ మీద చూసిన విజయ్ సేతుపతిని మొదటిసారి డైరెక్టుగా చూస్తున్నాను. స్క్రీన్ మీద కంటే కూడా రియల్ గా విజయ్ సేతుపతి ఇంకా బాగున్నాడు అంటూ ట్విట్టర్ వేదికగా ఒక ఫోటోను రిలీజ్ చేసాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు