Kajal about Acharya: ‘సత్యభామ’ ప్రమోషన్స్ లో ‘ఆచార్య’ ప్రస్తావన.. పెద్ద గొడవ చేసిన కాజల్

Kajal about Acharya: లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్. అయితే మొదటి సినిమా తోనే బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా కాజల్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన మగధీర సినిమాని చెప్పాలి. ఈ సినిమా తర్వాత కాజల్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన ఆర్య 2 సినిమాలో కూడా కనిపించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని నమోదు చేసుకుంది.

kajal

స్టార్ హీరోల సరసన

హీరోయిన్ గా చాలామంది స్టార్ హీరోల సరసన నటించింది. అల్లు అర్జున్ తో ఆర్య 2, పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం, ఎన్టీఆర్ తో బృందావనం ఇలా చాలా సినిమాలు చేసింది కాజల్. అయితే ప్రతి హీరోయిన్ కి కూడా ఒక సొంత లైఫ్ అంటూ ఉంటుంది. అలా తన వ్యక్తిగత జీవితం మీద ఫోకస్ చేసి గౌతమ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది కాజల్. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది రీసెంట్ గా బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

- Advertisement -

Kajal Aggarwal

కాజల్ రీఎంట్రీ

ప్రస్తుతం ఒకప్పుడు హీరోయిన్గా చలామణి అయిన వాళ్లంతా కూడా ఇప్పుడు ఫిమేల్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న సినిమాలు చేయడంలో ఆసక్తి చూపుతున్నారు. ఇక లేడి ఓరియంటెడ్ సినిమాలను తమ కెరియర్లో ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా సమంత కూడా వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ కూడా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆచార్య వివాదం

ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఆచార్య సినిమాలో ముందుగా హీరోయిన్ గా కాజల్ ను ఫిక్స్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా నుంచి కాజల్ తప్పించారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆచార్య సినిమాలో సరైన జోడి ఉండదు. అయితే ఈ విషయం గురించి సత్యభామ మూవీ ప్రమోషన్స్ లో కాజల్ ను అడిగితే పెద్దగా గొడవ చేసారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు