Karthikeya 2: ప్రభంజనం

ఎటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఎప్పుడు చెప్పలేని పరిస్థితి అదే తెలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. టాలీవుడ్ కి గడ్డుకాలం నడుస్తున్న తరుణంలో సరిగ్గా మూడు సినిమాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ప్రేక్షకులు థియేటర్ కి రావట్లేదు అని నిర్మాతలు, డిస్ట్బ్యూటర్స్ వాపోతున్న టైములో, ఒక మంచి సినిమా తీస్తే ఆడియన్స్ ప్రవాహంలా థియేటర్ కి వస్తారు అని నిరూపించిన సినిమాలు బింబిసార, సీతారామం , కార్తికేయ.

సీతారామం, బింబిసార సినిమాలు ప్రక్కన పెడితే, ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని రిలీజైన చిత్రం కార్తికేయ-2. నిఖిల్ సిద్దార్థ్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రానికి చందుమొండేటి దర్శకత్వం వహించాడు. రెండు పాండమిక్ లు దాటిన తర్వాత కూడా ఈ చిత్రం విడుదల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ముందుగా ఈ సినిమాను జులై 22న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అదే రోజు నాగ చైతన్య “థాంక్యూ” చిత్రం విడుదల కారణంగా ఈ చిత్రాన్ని వెనక్కు నెట్టేశారు. ఆగష్టు 5న రిలీజ్ కు ప్లాన్ చేసారు కానీ అది వర్కౌట్ కాలేదు. ఆగష్టు 12న కార్తికేయ చిత్రం రిలీజ్ అంటూ ఆఫీసియల్ అనౌన్సమెంట్ ఇచ్చారు. కానీ అదే రోజు నితిన్ నటించిన “మాచర్ల నియోజకవర్గం” విడుదల కారణంగా ఒకరోజు వెనక్కు నెట్టారు.

ఆలస్యం అమృతం అని చెప్పినట్లు సినిమా మొదటి షో పడగానే సెకండ్ షో కి టికెట్స్ దొరకని పరిస్థితి. విడుదలైన అన్ని సెంటర్స్ లో దాదాపు హౌస్ఫుల్,ఈ చిత్రం రీసెంట్ గా 100కోట్ల మార్కును దాటి ఇప్పుడు 120 కోట్లు నుండి రన్ ను కొనసాగిస్తోంది. రీసెంట్ రిలీజైన సినిమాలు ఏవి ఆకట్టుకోకపోవడం వలన. ఈ చిత్రం ఇంకా విజయవంతగా నడుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు